విజయనగరం జిల్లా పర్లలో ఉద్విగ్న వాతావరణం

విజయనగరం జిల్లా పర్లలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.పశ్చిమ బెంగాల్ లో జరిగిన ప్యారాచూట్ ప్రమాదంలో నిన్న గోవింద్ మృతిచెందిన విషయం తెలిసిందే.

కాగా పారాట్రూపర్ల బృందంలో గోవింద్ సభ్యుడిగా ఉన్నారు.దాంతో పాటుగా విశాఖ నేవల్ బేస్ లో మెరైన్ కమాండోగా ఉన్నారు.

పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా.ఈ ప్యారాచూట్ ట్రైనింగ్ లో గోవింద్ పాల్గొన్నారు.

శిక్షణలో ఉన్న ఆరుగురు ఒక్కొక్కరిగా కిందకి దూకేందుకు గోవింద్ సాయపడ్డారు.చివరిలో ఆయన హెలికాఫ్టర్ నుంచి దిగుతుండగా ప్యారాచూట్ తెరుచుకోకపోవడంతో ప్రమాదం జరిగింది.

ఈ క్రమంలో గోవింద్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి చేరుకుంది.భారీ ర్యాలీగా ఆయన మృతదేహాన్ని తరలించగా.

నావీ ఉద్యోగులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కాసేపటిలో అధికారిక లాంఛనాలతో కమాండో గోవింద్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

టికెట్ల రేట్లు పెంపుపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు శిరీష్… కౌంటర్ మామూలుగా లేదు?