జనసేన ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర
TeluguStop.com
ఏపీలోని ఉమ్మడి కడప జిల్లాలో ఈనెల 20న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
రాష్ట్రంలో ఆత్మహత్యతలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఆయన ఈ యాత్ర నిర్వహించనున్నారు.
సాగు నష్టాలు, అప్పుల బాధలతో బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.మృతుల కుటుంబ సభ్యులకు రూ.
1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.అనంతరం రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు.