ప్రజల ముందు పదేళ్ల నిజం.. ఆరు నెలల అబద్దం .. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) చౌటుప్పల్ లో మునుగోడు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం దివాళా తీసిందని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
గతంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చింది అప్పటి సీఎం కేసీఆర్( KCR ) కాదా అని నిలదీశారు.
కేసీఆర్ పాలనలో కరెంట్, నీళ్లకు ఎక్కడా ఇబ్బంది లేదన్నారు.రైతుబంధు, రైతుబీమా తెచ్చింది కేసీఆర్ కాదా అన్న కేటీఆర్ ఒక్క హామీని అమలు చేసి ఐదు హామీలను అమలు చేశామని చెప్తున్నారని మండిపడ్డారు.
పదేళ్ల నిజంఈతో పాటు ఆరు నెలల అబద్ధం ప్రజల ముందే ఉందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో మంచి ఎవరితో జరిగిందో ప్రజలకు తెలుసని కేటీఆర్ తెలిపారు.
అమ్మ ఫ్రైస్‌ను క్యూట్‌గా దొంగిలించిన బుడ్డోడు.. నవ్వులు పూయించే వీడియో వైరల్!