ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు విచారణ వాయిదా

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

తదుపరి విచారణ వరకు సీబీఐ దర్యాప్తును నియత్రించలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవని దవే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ వ్యవహారం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేదన్నారు.మరోవైపు కేసు వివరాలను సీఎం మీడియా సహా అందరికీ పంపారని బీజేపీ తరపు న్యాయవాది తెలిపారు.

కేసు వివరాలు, ఆధారాలు సీఎం స్వయంగా లీక్ చేశారని జఠ్మలాని తెలిపారు.తమ దగ్గర ఐదు గంటల వీడియో, కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్ లతో పాటు ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని దవే పేర్కొన్నారు.

అనంతరం కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని దవే ప్రశ్నించారు.ఈ క్రమంలో వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈనెల 27న విచారణ జరుపుతామని ప్రకటించింది.

భారీ అంచనాలతో వచ్చిన రాయన్ ప్లాప్ అయింది.. మరి ధనుష్ పరిస్థితి ఏంటి..?