వేడెక్కుతున్న భారతం! అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరాల జాబితాలో భారత్ టాప్

ఇండియాలో ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు తీవ్రత పెరిగి పోతున్నాయి.ఈ ఎండల తీవ్రత వలన జనం పిట్టల్ల రాలిపోతున్నారు.

పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతల శాతం పెరుగుతూ వెళుతున్నాయి.ప్రస్తుతం దేశంలో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదు అవుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన తొలి 15 నగరాల్లో టాప్ 10 నగరాలు భారత్లోనే ఉండటం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఎల్ డోరాడో అనే వెబ్సైట్ విడుదల చేసిన వివరాల ప్రకారం రాజస్థాన్ లో చురులో 48.

9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు తొలిస్థానంలో నిలిచింది.రెండో స్థానంలో శ్రీ గంగానగర్ ఉండగా తర్వాత ఉత్తరప్రదేశ్లోని బాంద హర్యానా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలుగా ఉన్నాయి.

భారత్లో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నగరాల్లో ఢిల్లీ, లక్నో, కోట, హైదరాబాద్, జైపూర్ నగరాలు ఉన్నాయి.

ఇక దేశంలో అత్యంత చల్లని ప్రదేశాలైన సిమ్లా నైనిటాల్ శ్రీనగర్లోని కూడా సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు ఆందోళన కలిగిస్తుంది.

భారతదేశంలో ఎండల తీవ్రత రెండు దశాబ్దాల కాలంలో గణనీయంగా పెరిగాయి అని భారత వాతావరణ విభాగం సైతం తెలిపింది.

మరోవైపు ప్రతి సంవత్సరం వడదెబ్బ కారణంగా మృతుల సంఖ్య పెరిగిపోతుంది.ప్రపంచవ్యాప్తంగా సగటున 0.

6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగ్గా ఒక్క భారతదేశంలో 0.8 డిగ్రీలు పెరిగింది.

1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా 2018 నిలిచింది ఈ సంవత్సరం వాతావరణ మార్పులు ఆలస్యం అయితే వచ్చే ఏడాది మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

నేను పిల్లల్ని కనకపోవడానికి అసలు కారణాలివే.. వరుణ్ సందేశ్ భార్య కామెంట్స్ వైరల్!