ఎండలు బాబోయ్…!

నల్లగొండ జిల్లా:రోహిణి కార్తె( Rohini Karthi )లో రోళ్ళు పగిలే ఎండలు ఉంటాయని అంటారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా( D Nalgonda District ) వ్యాప్తంగా గురువారం కురిసిన అగ్నివర్షపు వేడినిచూస్తే అది నిజమే అనిపిస్తుంది.

గత వారంలోవర్షాల పడి వాతావరణం కాస్త చల్లబడింది దీనితో వేసవి తాపం నుండి ఇక ఉపశమనం కలుగుతుందని భావించారు.

కానీ,రెండు రోజుల నుండి ఉష్ణోగ్రతలు ( Temperatures )అధికంగా నమోదు అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే జంకుతున్నారు.

ఉదయం 8 గంటలకే 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వడం, వడగాల్పులు,ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పదుతున్నారు.

మధ్యాహ్నం అయిందంటే సాలు 48 డిగ్రీలు నమోదు అవుతుండడంతో జిల్లా వ్యాప్తంగా రహదారులు నిర్మానుషంగా మారుతున్నాయి.

వాహనదారులు,ప్రజలు ఎండ వేడిని తట్టుకోలేక శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు,జ్యూస్ లతో సేద తీరుతున్నారు.

వైసీపీ హయాంలో పోలవరం పనులపై మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!!