అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం హింసాత్మకం

నేడు అసెంబ్లీని ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం చేసిన విషయం తెల్సిందే.అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు మరియు మంత్రులు హాజరు అయ్యారు.

ఇదే సమయంలో వెలగపూడితో పాటు స్థానిక ప్రజలు అంతా కూడా రాజధానిగా అమరావతి ఉండాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

వారు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు.పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారులు అసెంబ్లీని ముట్టడించేందుకు వస్తున్న క్రమంలో వారిని అడ్డుకునేందుకు స్వల్ప లాఠీ చార్జ్‌ చేయాల్సి వచ్చింది.

పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.అయినా కూడా కొందరు రైతులు మరియు ప్రజా సంఘాల వారు అసెంబ్లీని చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

అసెంబ్లీ చట్టు నాలుగు వలయాల పోలీసు భద్రత ఉండటం వల్ల రైతులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విఫలం అయ్యింది.

పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు రైతులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

పోలీసులు మరీ కఠినంగా వ్యవహరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వైరల్ వీడియో: ఆకాశంలో అబ్బురపరిచే వెలుగు.. రెప్పపాటులో..