ఆ ఉపాధ్యాయుడు నగ్నంగా క్లాసులు చెబుతూ వేధించాడంటున్న హీరోయిన్....

ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నప్పటికీ అడ్డుకట్ట మాత్రం చేయలేకపోతున్నాయి.

దీంతో ఆడపిల్లలకి బడిలో, బాహ్య ప్రపంచంలో చివరికి తమ ఇంట్లో కూడా రక్షణ కరువైంది.

కాగా ఇటీవలే తమిళనాడులోని ఓ ప్రముఖ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఆన్ లైన్ క్లాసుల పేరుతో నగ్నంగా కనిపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కొంతమంది విద్యార్థునూలు ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా ఈ విషయంపై తెలుగులో ప్రముఖ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన "జాను" చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన నటి గౌరీ జీ కిషన్ కూడా స్పందించింది.

ఇందులో భాగంగా ఉపాధ్యాయుడు చేతిలో లైంగిక వేధింపులకు గురైన వారిలో తన స్నేహితురాలు కూడా ఉందని తెలిపింది.

అంతేకాకుండా ఉపాధ్యాయుడు చేసిన బాగోతాన్ని స్క్రీన్ షాట్ తీసి తన స్నేహితురాలు తనకు పంపించిందని తెలిపింది.

అలాగే లైంగిక వేధింపులపై స్పందిస్తూ ప్రముఖ సింగర్ చిన్మయి చేస్తున్నటువంటి పోరాటానికి తన మద్దతు తెలియజేసింది.

"""/"/ కాగా ఇటీవల గౌరీ జి కిషన్ తమిళ ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా నటించిన కర్ణన్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి తమిళం, మలయాళం, తదితర భాషలలో వరుస సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

అలాగే ఓ తమిళ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో గౌరి జి కిషన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

బంగాళదుంప తింటే బరువు పెరుగుతారా..?