ఈ యంగ్ హీరో తండ్రి టాలీవుడ్ లో ప్రముఖ సినీ నిర్మాతని మీకు తెలుసా..?

ఈ యంగ్ హీరో తండ్రి టాలీవుడ్ లో ప్రముఖ సినీ నిర్మాతని మీకు తెలుసా?

తెలుగులో ప్రముఖ సినీ దర్శకుడు మరియు నిర్మాత ఎమ్మెస్.రాజు దర్శకత్వం వహించిన "తూనీగ తూనీగ" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో "సుమంత్ అశ్విన్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ యంగ్ హీరో తండ్రి టాలీవుడ్ లో ప్రముఖ సినీ నిర్మాతని మీకు తెలుసా?

ఎప్పుడూ విభిన్న కథనాలతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను సుమంత్ అశ్విన్ బాగానే ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఈ యంగ్ హీరో తండ్రి టాలీవుడ్ లో ప్రముఖ సినీ నిర్మాతని మీకు తెలుసా?

కానీ నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి సుమంత్ అశ్విన్ కి ఇప్పటివరకు తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాలేదని చెప్పవచ్చు.

అందువల్లనే ఎంతో టాలెంట్ ఉన్న సుమంత్ అశ్విన్ గుర్తింపుకు నోచుకోలేక పోతున్నాడు.అయితే సుమంత్ అశ్విన్ తండ్రి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ బడా నిర్మాత అని ఇప్పటి వరకు చాలా మంది సినీ అభిమానులకి తెలియదు.

 అయితే ఆయన ఎవరు అనుకుంటున్నారా.? అతడు ఎవరో కాదు ప్రముఖ సినీ నిర్మాత ఎమ్మెస్.

 రాజు.అయితే ఎమ్మెస్ రాజు తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక్కడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో వర్షం, అలాగే మనసంతా నువ్వే, దేవీ పుత్రుడు, మస్కా ఇలా దాదాపుగా పదికి పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.

అంతేగాక "తూనీగ తూనీగ" అనే చిత్రం ద్వారా తన కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు.

అలాగే ఇటీవలే విడుదలైన "డర్టీ హరి" అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఆన్ లైన్ ద్వారా విడుదల చేయగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ నెల 13వ తారీఖున సుమంత్ అశ్విన్ వివాహం దీపిక అనే యువతితో జరగబోతోంది.

దీంతో ఎమ్మెస్ రాజు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకి ఆహ్వానం కూడా పంపించాడు.కాగా ప్రస్తుతం సుమంత్ అశ్విన్ తెలుగులో "ఇదే మా కథ" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో నూతన హీరోయిన్ తాన్యా హోప్ మరియు సీనియర్ నటుడు శ్రీకాంత్, అలాగే వెటరన్ హీరోయిన్ భూమిక చావ్లా తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు గురు పవన్ దర్శకత్వం వహిస్తుండగా గురప్ప పరమేశ్వరన్ పతాకంపై నిర్మిస్తున్నారు.

దారుణం.. టెల్సా కారుతో ముగ్గురిని చంపేసి, జోకులేసిన యువకుడు..