ఈ తెలుగు వెటరన్ హీరోయిన్ మళ్ళీ రీ – ఎంట్రీ ఇస్తోందా…
TeluguStop.com
తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన "సందడే సందడి" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయమైన ప్రముఖ తమిళ హీరోయిన్ "మధుమిత" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
మధుమిత ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే సినిమా కెరీర్ పరంగా వరుస అవకాశాలతో రాణిస్తున్న సమయంలో టాలీవుడ్ హీరో శివ బాలాజీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెళ్లయిన తర్వాత మధుమిత కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే బాధ్యతలను తీసుకోవడంతో సినిమాలపై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.
కానీ అప్పుడప్పుడు అడపాదడపా పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరించింది.అయితే మధుమిత తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
ఈ మధ్య కాలంలో మధుమిత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.ఈ క్రమంలో పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటోంది.
అంతేగాక ఆ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ రోజురోజుకీ ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం మధుమిత మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోందని టాలీవుడ్ సినీవర్గాలు చర్చించుకుంటున్నారు.
అయితే గతంలో మధుమిత తన పాత్రలతో సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ పెళ్లి కారణంగానే సినిమా పరిశ్రమకు దూరమైందని ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మధుమిత తమిళంలో ప్రముఖ దర్శకుడు వెట్రివేల్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న "బుద్ధాన్ యేసు గాంధీ" అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. ఇటీవలే మరో ప్రముఖ తమిళ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న "గర్జనై" అనే చిత్రంలో నటించడానికి కూడా మధుమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆ సంఘటన వల్లే నేను మతం మారాను.. హీరోయిన్ రెజీనా కామెంట్స్ వైరల్!