అప్పట్లో నన్ను కూడా అలాంటి పనులకి గెస్ట్ హౌస్ కి పిలిచారు.. కానీ

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన  "శుభలగ్నం" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి ఆమని గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే హీరోయిన్ ఆమని అప్పట్లో విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ  తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని బాగానే అలరించింది.

అయితే ఆమధ్య పలు వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలం పాటు సినీ పరిశ్రమకు దూరం అయింది.

అయితే ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి ఆమని పాల్గొని తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

 అయితే ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో సినిమా అవకాశాలు బాగానే వచ్చాయని కానీ నటన పరంగా మెళుకువలు తెలియకపోవడంతో  కొంతమేర నటించడానికి ఇబ్బంది పడ్డానని ఆ తర్వాత మెల్ల మెల్లగా అంతా సెట్ అయిందని చెప్పుకొచ్చింది.

  తాను పెద్దగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కోలేదని కానీ ఓసారి సినీ ప్రముఖులమని  చెప్పుకుంటూ  తిరిగేటువంటి కొంతమంది పెద్దలు అవకాశాల పేరుతో తనని లొంగదీసుకోవాలని చూశారని తెలిపింది.

  కానీ తాను మాత్రం ఇప్పటివరకూ సినిమా అవకాశాల కోసం ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.

అంతేగాక సినీ పరిశ్రమలో నిజంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి దర్శక నిర్మాతలు లేదా మారె ఇతర నటీనటులు అసభ్యకరంగా లేదా లైంగిక వేధింపులకు పాల్పడరని కూడా స్పష్టం చేసింది.

అయితే ఆ మధ్య ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ నటించిన  "చందమామ కథలు" అనే చిత్రంలో ప్రాధాన్యత పాత్రలో నటించింది.

 ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నటి ఆమని కి మంచి కంబ్యాక్ లభించింది.

 కాగా ప్రస్తుతం తెలుగులో ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ హీరో శివ కార్తికేయ హీరోగా నటిస్తున్న "చావు కబురు చల్లగా" అనే చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటిస్తోంది.

యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!