TV Serials : ఒక్క సీరియల్ కూడా తెలుగు కాదు అంత రీమేకుల మయం.. వరస్ట్ రేటింగ్

సాయంత్రం టైం 7 దాటిందంటే చాలు ప్రతి ఇంట్లో సీరియల్స్ పెట్టాల్సిందే.ఇంట్లో ఉండే మహిళలు ఏ టైం అయినా మిస్ అవుతారేమో కానీ సీరియల్స్ వచ్చే టైమింగ్స్ ని అస్సలు మిస్ అవ్వరు.

కొన్ని సీరియల్స్ ( Serials )అయితే వేల ఎపిసోడ్స్ తో రికార్డులు సృష్టించాయి.

ఒకప్పుడు సీరియల్స్ కి రేటింగ్ బాగుండేది.తెలుగు సీరియల్స్ కూడా వచ్చేవి.

కానీ రాను రాను సీరియల్స్ రేటింగ్ కూడా పడిపోతుంది.అంతేకాదు తెలుగు సీరియల్స్ కూడా బాగా తగ్గిపోయాయి.

ఇప్పుడాన్ని రీమేక్ సీరియల్స్ ( Remake Serials )మాత్రమే నడుస్తున్నాయి. """/" / టీవీ సీరియల్స్ అంటే ఇప్పుడు అందరికి గుర్తొచ్చే సీరియల్ కార్తీకదీపం( Karteeka Deepam ).

టీవీ రేటింగ్ సీరియల్ లో కార్తీకదీపం ఒక రికార్డు సృష్టించిందనే చెప్పాలి.మిగితా సీరియల్ లు కూడా ఉన్న మాటివి సీరియల్ లో అందరికి గుర్తొచ్చే సీరియల్ కార్తీకదీపం.

ఈ సీరియల్ రేటింగ్స్ హై రేంజులో ఉండేవి.అయితే ముందు బాగా ఉన్న ఈ సీరియల్ ఆ తరువాత చాలా మార్పులు చేసుకుంది.

ఆ తరువాత క్లోజ్ అయిపోయింది.ఈ సీరియల్ లో అందరికి ముందు గుర్తొచ్చేది ప్రేమి విశ్వనాథ్( Premi Vishwanath ) అనే చెప్పాలి.

వంటలక్కగా నటించి మంచి మార్కులే కొట్టేసింది.కార్తీక దీపం తెచ్చిన రేటింగ్ మరే సీరియల్ తీసుకోరాలేక పోయింది.

ఇప్పుడు కొన్ని సీరియల్ లు ట్రై చేస్తున్నా కుదరడం లేదు. """/" / కార్తీక దీపం తరువాత ప్రస్తుతం బ్రహ్మముడి( Brahmamudi ) సీరియల్ మంచి రేటింగ్స్ సాధిస్తోంది.

అయితే ఈ సీరియల్ బెంగాలీ సీరియల్ గట్చోరాకు తెలుగు వెర్షన్.ఆ తరువాత స్తానంలో నాగ పంచమి ఉంది.

అయితే ఈ సీరియల్ కూడా ఒక బెంగాలీ సీరియల్ పొంచోమికి తెలుగు వెర్షన్.

ఈ సీరియల్ లో నటించే వారు పెద్ద పాపులర్ యాక్టర్స్ కాదు.అయినా ఈ సీరియల్ రేటింగ్ లో మంచి స్తానంలో ఉంది.

ఇక మూడో ప్లేస్ లో ఉన్న సీరియల్ కృష్ణా ముకుందా మురారి( Krishna Mukunda Murari ).

అంతేకాదు ఈ సీరియల్ కూడా ఒక బెంగాలీ సీరియల్‌కు తెలుగు వెర్షన్.కుసుమ్ డోలా అనే సీరియల్ ని తెలుగు వెర్షన్ లోకి మార్చారు.

ఇది మీరు గమనించారా.తెలుగులో మంచి రేటింగ్ లతో వెళ్తున్న సీరియల్ లన్ని బెంగాలీ సీరియల్ ల రీమేకులే.

వీటి తరువాత మంచి రేటింగ్ తో వెళ్తున్న సీరియల్ జీతెలుగులో వచ్చే త్రినయని, ప్రేమ ఎంత మధురం సీరియళ్లు.

త్రినయని సీరియల్ కూడా బెంగాలీ నుంచి రీమేక్ చేసిందే.తెలుగు చానెల్స్ లో వచ్చే సీరియలన్ని రీమేక్ కావడంతో తెలుగు సీరియళ్లు ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నారు.

మురారి ఫ్లాప్ అని కామెంట్ చేసిన నెటిజన్.. కృష్ణవంశీ రియాక్షన్ కు షాకవ్వాల్సిందే!