రాజమౌళి బాటలోనే నడవనున్న తెలుగు టాప్ డైరెక్టర్లు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన టాప్ ఫైవ్ తెలుగు డైరెక్టర్లు ఎవరూ అనే విషయం మీద చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి.
ఇప్పుడూ అందరూ కూడా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ సక్సెస్ లను కొడుతున్నారు.
ఇక ఇదే క్రమంలో తెలుగు డైరెక్టర్లందరు వాళ్ళకంటు ప్రత్యేకతను చాటుకుంటున్నారు.ఇక అందులో రాజమౌళి( Rajamouli ) టాప్ ప్లస్ లో ఉండగా ఆయన తర్వాత మిగిలిన స్థానాలలో కొరటాల శివ, పూరి జగన్నాథ్, సుకుమార్, సందీప్ వంగ లాంటి దర్శకులు కూడా ఉన్నారు.
"""/" /
మరి ఇలాంటి క్రమంలో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో జానర్ లో సినిమాలు చేస్తూ ఎక్కువ విజయాలను సాధిస్తు వస్తున్నారు.
ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) అనిమల్ సినిమాతో 900 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టాడు.
ఇక పుష్ప 2 సినిమాతో సుకుమార్( Sukumar ) కూడా వెయ్యి కోట్లకు పైన వసూళ్లను రాబట్టాలని చూస్తున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో డైరెక్టర్ల హవా ఎంత వరకు కొనసాగుతుందనేది కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక వీళ్ళ హవా తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో కూడా భారీగానే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది.
రాజమౌళి ఇప్పటికే పాన్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నాడు.ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ కావడమే ఆయన సక్సెస్ కి కారణం అంటూ సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక రాజమౌళి పాన్ వరల్డ్ లో సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న మన డైరెక్టర్లు కూడా తొందర్లోనే పాన్ వరల్డ్ దర్శకులుగా( Pan World Directors ) మారబోతున్నారు అంటూ మరికొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
వైరల్: పిల్లి, కప్పతో పాము పోరాటం.. మామ్మూలుగా లేదుగా!