శ్రీనగర్ ఎన్ఐటీ నుంచి ఢిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులు..!

శ్రీనగర్ ఎన్ఐటీ నుంచి తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.ఇన్ స్టాగ్రామ్ లో విద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో మత ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే.

ఎన్ఐటీ క్యాంపస్ ముందు ఓ వర్గం సంఘాలు ధర్నాకు దిగగా మరో వర్గం సంఘాలు ఎన్ఐటీ విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చాయని తెలుస్తోంది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఆర్మీ క్యాంపస్ ను మూసివేయడంతో పాటు విద్యార్థులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

కాగా శ్రీనగర్ ఎన్ఐటీలో సుమారు 700 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు.ఈ క్రమంలో మత ఘర్షణలు చేతులు దాటే అవకాశం ఉండటంతో ఎన్ఐటీ ముందుగానే శీతాకాల సెలవులు ప్రకటించింది.

ఢిల్లీ చేరిన విద్యార్థులను స్వస్థలాకు పంపేందుకు ఏపీ భవన్ ఏర్పాట్లు చేస్తుంది.అప్పటివరకు ఏపీ భవన్ లోనే తాత్కాలిక వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఫోన్ చేస్తే అలా రియాక్ట్ అయ్యారు: కమెడియన్ సుధాకర్