నాగార్జున కోసం కొత్త క్యారెక్టర్స్ ను డిజైన్ చేస్తున్న తెలుగు స్టార్ డైరెక్టర్స్…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి( Akkineni Family ) ఉన్న ఇమేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ దాదాపు మూడు జనరేషన్ల నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతుంది.
మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీగా ముందుకు సాగడమే కాకుండా సగటు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.
"""/" /
ఇక ఇప్పటికే నాగార్జున( Nagarjuna ) అటు హీరోగా చేస్తూనే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ( Character Artist )గా కూడా కొన్ని సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక అందులో భాగంగానే రజినీకాంత్ హీరోగా వస్తున్న 'కూలీ ' సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తుండటం విశేషం.
ఇక అలాగే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న 'కుబేర ' ( Kubera )సినిమాలో కూడా నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మరి ఈ రెండు సినిమాల్లోని ఆయన పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
"""/" /
ఇక మొత్తానికైతే నాగార్జున తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక అందులో భాగంగానే మన తెలుగు దర్శకులు కూడా నాగార్జున కోసం కొన్ని సపరేట్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటివరకు ఆయన చేస్తున్న రెండు సినిమాలు కూడా తమిళ్ హీరోల సినిమాలే కావడం విశేషం.
మరి తెలుగు హీరోల సినిమాల్లో మంచి క్యారెక్టర్ వస్తే నాగార్జున నటిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి .
ఇక ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం తన వందో సినిమాని కూడా చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు.
ఈ సినిమాను పట్టాలెక్కించి చాలా తొందరగా షూట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యం లో కూడా తను ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇంతకుముందు రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ తో చేయాల్సిన ఒక సినిమాని మధ్యలోనే ఆపేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?