Singer Harika Narayan : సింపుల్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్( Wedding Season ) నడుస్తోంది.సెలబ్రిటీలు చాలామంది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.
ఇప్పుడు అలా మరో టాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లి చేసేసుకుంది.ఇటీవలె నిశ్చితార్థం జరగగా రెండు వారాలు కూడా గడవక ముందే ప్రియుడితో ఏడడుగులు వేసి అభిమానులకు షాక్ ఇచ్చింది ఒక సింగర్.
చాలా సింపుల్‌గా జరిగిన ఈ వేడుకలో బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రేవంత్ కనిపించాడు.
ఈ క్రమంలోనే కొత్త జంటకు తోటీ సింగర్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. """/"/
ఆమె మరెవరో కాదు సింగర్ హారికా నారాయణ్( Singer Harika Narayan ).
ఇటీవలే తనకు కాబోయే భర్తతో ఎంగేజ్మెంట్ వేడుకున్న జరుపుకున్న ఆమె అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఎటువంటి హంగామా లేకుండా మూడుముళ్ల బందంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
ఇకపోతే గత ఏడేళ్లుగా పృథ్వీ వెంపటి( Prudhvinath Vempati ) అనే కుర్రాడితో ప్రేమలో ఉన్న హారికా నారాయణ్.
ఈ విషయాన్ని పెద్దగా బయటపెట్టుకోలేదు.మార్చి 6న నిశ్చితార్థం జరిగిన తర్వాత అతడి ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
"""/"/
ఈ శుభాకార్యం జరిగిన రెండు వారాల్లో అంటే మార్చి 17న ఈ బ్యూటీఫుల్ లేడీ సింగర్( Lady Singer ) పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లి ఫొటోలు ఎక్కడా బయటకు రాలేదు.వేడుకకు హాజరైన సింగర్ రేవంత్ తన ఇన్ స్టాలో కొత్త జంట ఫొటో పెట్టి విషెస్ చెప్పుకొచ్చాడు.
దాంతో ఈ పెళ్లి విషయం బయటకు వచ్చింది.ఎంగేజ్మెంట్ గురించి తెలిపిన ఆమె పెళ్లి గురించి ఎందుకు సీక్రెట్ గా దాచింది అన్న విషయం చాలామంది అభిమానులకు అర్థం కావడం లేదు.
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements Pour Les Joueurs Français