అటు బుల్లితెర మీద కూడా బ్రదర్స్ హడావిడి కొనసాగుతోంది.వెండి తెరకు దీటుగా టీవీ తెరకు ఆదరణ పెరగడంతో నటీ నటులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.
సినిమా రంగంలోనే కాకుండా టీవీ రంగంలో కుటుంబ సభ్యుల జోరు కొనసాగుతోంది.తాజాగా సావిత్రమ్మ గారబ్బాయి సీరియల్ లో నటిస్తున్న బాలాదిత్య, కౌశిక్ స్వయంగా అన్నదమ్ములు.
గోరింటాకు సీరియల్ లో నిఖిల్, కస్తూరి సీరియల్ హీరో నాగార్జున్న సొంత అన్నదమ్ములు.
కస్తూరి సీరియల్ లో హీరో తండ్రి వాసుదేవ్, రుద్రమదేవి సీరియల్ హీరో శ్రీధర్ ఇద్దరూ బ్రదర్సే! ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటిస్తున్న వెంకట్, కృష్ణ అన్నదమ్ములు.
కార్తికదీపంలో హీరో క్యారెక్టర్ చేస్తున్న నిరుపమ్, నెంబర్ వన్ కోడలు లో కీరోల్ పోటషిస్తున్న జయ ధనుష్ కూడా అన్నదమ్ములే.
నటుడు ఇంద్రనీల్, అరవింద్ సొంత అన్నదమ్ములు కావడం విశేషం.మొత్తంగా వెండితెరతో పాటు బుల్లి తెర కూడా రోజు రోజుకు బంధువులతో నిండిపోతుంది.
అటు నటీ మణుల్లో సైతం పలువురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు.పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం సీరియల్స్ లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆ కాల్స్‌తో జాగ్రత్త .. అమెరికాలోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ అలర్ట్