నన్ను కూడా అలాంటి కమిట్మెంట్ అడిగారంటున్న సీరియల్ నటి.. కానీ

తెలుగులో అప్పట్లో ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" అనే ధారావాహిక ద్వారా బుల్లితెర నటి గా పరిచయం అయిన రోహిణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ సీరియల్ లో రోహిణి బావ ప్రేమ ను దక్కించుకోవడం కోసం చేసే పనులతో కామెడీని పండిస్తూ ప్రేక్షకులని ఏంతగానో మెప్పించింది.

కాగా ప్రస్తుతం నటి రోహిణి ఈ మధ్య ఒకపక్క సీరియళ్లలో నటిస్తూనే మరోపక్క పలు షోలు, ఈవెంట్లలో కూడా తన కామెడీతో బాగానే అలరిస్తోంది.

అయితే తాజాగా నటి రోహిణి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో ముఖ్యంగా తాను చదువు పూర్తి చేసుకున్న వెంటనే క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగం సంపాదించానని అందువల్ల హైదరాబాద్ కి వచ్చానని తెలిపింది.

 ఈ క్రమంలో తనకు నటన పై ఉన్నటువంటి ఆసక్తి కారణంగా పలు సీరియళ్ల ఆడిషన్స్ కి వెళ్ళేదాన్నని చెప్పుకొచ్చింది.

అయితే తాను సినీ పరిశ్రమకు వచ్చిన మొదట్లో తెలిసిన వారి ద్వారా ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఓ దర్శకుడి మేనేజర్ కమిట్మెంట్ అడిగాడని దాంతో తాను వెంటనే నిర్మొహమాటంగా కమిట్మెంట్ ఇచ్చి అవకాశాలు దక్కించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ రిప్లై ఇచ్చి అక్కడ నుంచి వచ్చానని తెలిపింది.

ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఇలాంటి కమిట్మెంట్ సంఘటనలు ఎదురైనప్పటికీ తాను అంతే చాకచక్యంగా ఎదుర్కొన్నానని తెలిపింది.

అయితే సినిమా పరిశ్రమలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవడం సహజమని కాబట్టి అలాంటి వాటి వల్ల ఏ మాత్రం భయపడకుండా అడుగు ముందుకు వేస్తె కచ్చితంగా విజయం సాధించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం రోహిణి తెలుగు సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో  నటిస్తోంది.

అలాగే అప్పుడప్పుడు తెలుగులో మంచి ప్రజాదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీతో అలరిస్తోంది.

మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!