ఆ సీరియల్ వల్లే మా పెళ్లి జరిగిందంటున్న డాక్టర్ బాబు భార్య…

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను బాగానే అలరించిన భార్యాభర్తల జంటలలో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్, మంజుల ల జంట ఒకటి.

అయితే మంజుల మరియు నిరూపమ్ లు ఒకేసారి సినిమా పరిశ్రమలో తమ నటనా ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.

ఆ తర్వాత నిరూపమ్ పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆ పాత్రలు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేకపోయాయి.

దీంతో నిరూపమ్ బుల్లితెరపై దృష్టి సారించి మంచి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.అయితే తాజాగా నిరూపమ్ భార్య మంజుల పరిటాల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తాను కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగానని తెలిపింది.అలాగే తాను చదువును పూర్తిచేసి చార్టెడ్ అకౌంటెంట్ కావాలని అనుకున్నానని, కానీ తెలిసిన వారి ద్వారా ఓ కన్నడ సీరియల్ లో నటించే అవకాశం రావడంతో తన చదువుకి స్వస్తి చెప్పి నటన వైపు వచ్చానని తెలిపింది.

ఆ తరువాత తనకి తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈటీవీ లో ప్రసారమయ్యే చంద్రముఖి సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందని ఈ సీరియల్ తన వ్యక్తిగత జీవితాన్ని మరియు సినీ జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పిందని చెప్పుకొచ్చింది.

అంతేగాక ఈ సీరియల్ లో నటించేటప్పుడు తన భర్త నిరూపమ్  పరిచయం అయ్యాడని ఈ పరిచయం కాస్త ఒక సంవత్సరం తర్వాత ప్రేమ పరిణయానికి దారితీసిందని తెలిపింది.

అయితే ఈ సీరియల్ దాదాపుగా ఆరు సంవత్సరాలకు పైగా నడిచిందని అంతేకాక తనకి కూడా చాలా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందని చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం మంజుల పరిటాల తెలుగులో కృష్ణవేణి అనే ధారావాహికలో నటిస్తోంది.అలాగే తమిళంలో కూడా ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారమయ్యే ధారావాహికలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కనిపిస్తోంది.

ఇక నిరూపమ్  విషయానికి వస్తే తెలుగులో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే "కార్తీకదీపం" దర్బాహికలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ ధారావాహిక రికార్డు టిఆర్పి రేటింగులను నమోదు చేస్తోంది.కాగా ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ అయిన జీ తెలుగులో ప్రసారమయ్యే "హిట్లర్ గారి పెళ్ళాం" అనే ధారావాహికలో కూడా నిరూపమ్ మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే పలు ధారావాహికలకి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

డిసెంబర్ 11నే కీర్తి సురేష్ పెళ్లి… అధికారికంగా ప్రకటించిన తండ్రి సురేష్!