సౌందర్య లాంటి హీరోయిన్ తో సినిమా చేస్తూ కన్ను మూసిన ఆ వ్యక్తి ఎవరు..?
TeluguStop.com
ఒకప్పుడు సినిమాల్లో ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక గుర్తింపును ఇక్కడే సాధించాలి అని కసితో వచ్చిన చాలా మందిలో కొంతమంది ఏం సాధించకుండానే వెనక్కి వెళ్లిపోయారు.
ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అలాంటివి.తినడానికి తిండి ఉండదు చేయడానికి పని ఉండదు ఒక పూట తింటే మళ్ళీ ఎప్పుడు ఎక్కడ తింటామో కూడా తెలియదు.
కృష్ణానగర్ కి వచ్చి సినిమా అవకాశం కోసం తిరిగి తిరిగి ఇంటికి వెళ్లిపోయాన వాళ్లు చాలామంది ఉన్నారు.
కొంతమంది మాత్రమే చావైనా, బ్రతుకైనా ఇక్కడే తేల్చుకోవాలి అని ఉండి పోయిన వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ లో గాని, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గాని ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు దాంతో సినిమాటోగ్రాఫర్ అయిన వాళ్ళు ఉన్నారు డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్, జయభేరి ఇలాంటి ప్రొడక్షన్ లో చాలా సంవత్సరాలపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలి అనుకున్న ఆర్ఆర్ షిండే గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సురేష్ ప్రొడక్షన్ వారు హిందీలో నిర్మించే ప్రతి సినిమాకి షిండే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసేవాడు.
ఎందుకంటే అప్పుడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అందరికంటే ఎక్కువ హిందీ మాట్లాడేది షిండే గారు మాత్రమే.
ఆయన చాలా సంవత్సరాలు సురేష్ ప్రొడక్షన్ లో వర్క్ చేశాడు.నాగార్జునతో నిర్ణయం, కిల్లర్,రక్షణ వంటి సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు.
అయితే షిండే ఏజ్ పెరిగిపోతున్న పట్టించుకోకుండా సినిమానే ప్రాణంగా సినిమానే ధ్యాసగా ఏ రోజుకైనా సినిమా చేయాలి అనే పట్టుదలతో ఉండేవాడు మొత్తానికి అతనికి 50 సంవత్సరాల వయసులో సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది.
ఆ సినిమాలో ఇద్దరు హీరోలు కాగా ఒక హీరోగా శ్రీకాంత్ నీ తీసుకోగా ఇంకో హీరో ఎవరు అనుకున్నప్పుడు షిండే వెళ్లి నాగార్జున గారిని కలిసి స్టోరీ చెప్తే దీంట్లో నాగార్జున క్యారెక్టర్ చచ్చిపోతుంది.
ఎంతమంది హీరోలకు చెప్పిన ఒప్పుకోకపోవడంతో నాగార్జునకి షిండే తో ఉన్న పరిచయం కారణంగా ఫ్యాన్స్ గురించి పట్టించుకోకుండా ఈ సినిమా చేశాడు.
అప్పట్లో హీరో చనిపోయాడు అంటే సినిమా చూసే వారు కాదు కానీ నాగార్జున చాలా ధైర్యంగా ఈ సినిమా ఒప్పుకొని సినిమా చేశాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
దీంట్లో హీరోగా నాగార్జున తో పాటు శ్రీకాంత్ కూడా చేశాడు హీరోయిన్స్ గా సౌందర్యంతో పాటు రవళి కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసింది.
శ్రీకాంత్ ఫ్రెండ్ గా రాజేంద్రప్రసాద్ తనదైన మార్కు కామెడీతో జనాల్ని అలరించాడు.నిన్నే ప్రేమిస్తా సినిమా అప్పట్లో రిలీజ్ అయి మంచి పేరు సంపాదించుకుంది.
"""/"/
అయితే దీంట్లో ఇంకొక విషయం చెప్పాలి నిన్నే ప్రేమిస్తా సినిమాకి డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకిది ఫస్ట్ సినిమా.
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో షిండే మంచి దర్శకుడిగా గుర్తింపు పొందాడు.
తర్వాత చేసిన సినిమాలో శ్రీకాంత్ హీరోగా, సౌందర్య హీరోయిన్ గా నా మనసిస్తా రా అనే సినిమా చేశాడు.
దీంట్లో ఒక ముఖ్య పాత్రలో అప్పటికీ రిలీజై హిట్ అయినా నువ్వే కావాలి సినిమాలో హీరోయిన్ గా చేసిన రిచా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసింది.
నువ్వేకావాలి సినిమా తో నైట్ కి నైటే స్టార్ హీరోయిన్ అయిపోయిన అమ్మాయి రిచా.
అయితే సినిమా షెడ్యూల్ షూటింగ్ లో ఉన్నప్పుడే షిండే గుండెపోటుతో మరణించారు 2001లో ఆయన మరణిస్తే సినిమా 2002 లో రిలీజ్ అయింది సినిమా యావరేజ్ గా ఆడింది.
సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో అనే విషయం కూడా తెలియకుండా షిండే గారు మరణించడం చాలా చాలా బాధ కలిగించే విషయం.
మొత్తానికి 50 సంవత్సరాల వయసులో డైరెక్టర్ అయి మనం నమ్ముకున్న ఫీల్డ్ లో చివరి వరకు మన వంతు ప్రయత్నం మనం కొనసాగిస్తే ఎప్పటికైనా సక్సెస్ అవ్వచ్చు అని తన కృషితో మొత్తానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు పొందిన షిండే గారిని సినిమా ఇండస్ట్రీలో కష్టపడే పనిచేసే ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అతిథులు ఎవరంటే?