అరబ్బు దేశంలో ఘనంగా “తెలుగు బాషా దినోత్సవం”
TeluguStop.com
తెలుగు బాషా దినోత్సవం గురించి తెలుగు రాష్ట్రాల ఉన్న ఎంతో మంది తెలుగు వాళ్ళు మర్చిపోతుంటే దేశం కాని దేశంలో ఉంటూ పాశ్చాత్య సంస్కృతికి అతి దగ్గరగా ఉన్న మన తెలుగు ప్రవాసులు ఏ మాత్రం తెలుగు బాషా దినోత్సవాన్ని అశ్రద్ద చేయలేదు.
అత్యంత వైభవంగా తెలుగు బాషా దినోత్సవాన్ని జరుపుకుని తమ మాత్రు భాషపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
వివరాలలోకి వెళ్తే అరబ్బు దేశమైన ఖతర్ లో తెలుగు భాషాభివృద్ది కోసం, తెలుగు ప్రవాసుల పిల్లలకు తెలుగును నేర్పించడం కోసం అలాగే తెలుగు పండుగలు, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను భవిష్యత్త్ తరాలకు అందించడం కోసం ఎంతగానో కృషి చేస్తోంది ఖతర్ లోని ఆంధ్రకళా వేదిక.
ఎప్పటిలానే ప్రతీ ఏటా తెలుగు బాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది.గిడుగు రామ్మూర్తి 159 వ జయంతి సందర్భంగా ఖతర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎంతో అలరించింది.
ఈ కార్యక్రమానికి తెలుగు భాషా పండితులు , తెలుగు బాషాభిమానులు హాజరయ్యారు.ఆంధ్ర కళా వేదిక అద్యక్షులు భాగవతుల వెంకప్ప మాట్లాడుతూ ఉచితంగా తెలుగు బాషా తరగతులు, తెలుగు బాషా దినోత్సవాలను నిర్వహిస్తూ తెలుగు వెలుగుల కోసం ఖతర్ లో కృషి చేస్తూ తెలుగు దనం నింపుకున్న ఏకైక సంస్థ ఆంధ్ర కళా వేదిక ఉండటం తమకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఖతర్ లో ఉన్న తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరవ్వడం ఎంతో సంతోషంగా ఉందని విచ్చేసిన తెలుగు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలాఉంటే తెలుగు బాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు నిర్వహించిన పలు అంశాలపై పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు.
పిల్లలకు ఆశీస్సులు అందిస్తూ తెలుగును తమ పిల్లలకు నేర్పించాలని ముందుకు వచ్చిన తల్లి తండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
వింటర్ లో హెయిర్ ఫాల్ మరింత ఎక్కువైందా.. ఇలా చెక్ పెట్టండి!