ఇదేంటీ… తేజస్వి ఇలా రెచ్చిపోతుంది…

తెలుగులో మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం బాగా రాణిస్తున్న తెలుగమ్మాయి "తేజస్వి మదివాడ" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు సినీ అవకాశాలను కూడా దక్కించుకుంది.

  కానీ ఈ అమ్మడు నటించిన ఎక్కువ శాతం చిత్రాలలో ఈమె పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, ప్లాప్ అవడం వంటి వాటి కారణంగా సినిమా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

కాగా ప్రస్తుతం తేజస్వి మదివాడ సినిమా షూటింగులు లేకపోవడంతో ఇంటి పట్టునే ఖాళీగా ఉంటోంది.

 ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు రకాల ఫొటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫొటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అందమైన ఫోటోలని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తుంది.

అయితే తాజాగా స్కిన్ షో చేస్తూ కొంత మేర బోల్డ్ గా దిగినటువంటి ఫోటోలను తేజస్వి మదివాడ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

 ఈ ఫోటోలో కి ఫిదా అయిన నెటిజన్లు తేజస్వి మదివాడ రానురాను "మరీ బోల్డ్" గా తయారవుతుందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  అంతేగాక ఈమె ఫోటోలను షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తేజస్వి మదివాడ "కమిట్మెంట్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని ఇటీవలే తేజస్వి మదివాడ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తెలిపింది.

జై జగన్ అన్నా అంటూ వెటకారంగా పోస్ట్ పెట్టిన నటుడు బ్రహ్మాజీ.. అసలేమైందంటే?