ఆ హీరోయిన్ అలాంటి పనులు చేసే కోట్ల రూపాయలు సంపాదించిందా…
TeluguStop.com
తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి బుజ్జిగాడు చిత్రంలో హీరోయిన్ త్రిష చెల్లెలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పించినటువంటి కన్నడ బ్యూటీ సంజన గల్రాని గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు మొదట్లో అడపాదడపా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగ లేకపోయింది.
దీంతో సంజన గల్రాని శాండిల్ వుడ్ కి వెళ్ళి పోయింది.కాగా ప్రస్తుతం శాండిల్వుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో కర్ణాటక పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు.
ఇందులో భాగంగా సంజన గల్రాని ని అదుపులోకి తీసుకుని తీసుకుని విచారించారు.అయితే ఇందులో సంజన గల్రాని తాను మత్తు పదార్థాలను తీసుకోలేదని కానీ తన సహనటులు తీసుకున్నట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
దీంతో పోలీసులు మీరు తక్కువ సినిమాలలోనే నటించినప్పటికీ అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని అడగ్గా పలు సాకులు చెప్పి సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు పలు మీడియా వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అంతేకాక ఈ మత్తు పదార్థాల కేసులో స్థానిక కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే మరియు అతడి కుమారులు ప్రధాన సూత్ర ధారులుగా ఉన్నట్లు పోలీసులకు తెలిపిందట.
అయితే పోలీసులు మాత్రం ఆ ఎమ్మెల్యే ఎవరన్నది ఇప్పటి వరకు బయటకి చెప్పడం లేదు.
దీంతో మరికొంత కాలం పాటు సంజన గల్రాని పోలీసుల అదుపులో రిమాండ్లో ఉండనుంది.
దీంతో ప్రస్తుతం శాండిల్ వుడ్ లో ఈ డ్రగ్స్ కేసులో ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందోనని కొందరు సినీ ప్రముఖులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మలయాళ భాషలో సంజన గల్రాని చిల నియరింగుళిల్ చిలర్ అనే చిత్రంలో హీరోయిన్ గానటిస్తోంది.
అలాగే తమిళ భాషకు చెందిన మరో చిత్రంలో కూడా నటిస్తోంది.అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి సంజన గల్రాని మత్తు పదార్థాల కేసులో అరెస్టు కావడంతో ఈ చిత్రాల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది.
అల్లు అర్జున్ బోయపాటి కాంబోలో సినిమా రానుందా..? ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది…