అన్నీ ఉన్నా… అందుకే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ కాలేకపోయిందట…
TeluguStop.com
తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "లీడర్" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన "తమిళ బ్యూటీ ప్రియా ఆనంద్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
వచ్చీరావడంతోనే స్టార్ డైరెక్టర్ అయిన "శేఖర్ కమ్ముల" ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు ఎందుకో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది.
అయితే ఒకానొక సమయంలో ప్రియా ఆనంద్ కి తెలుగులో పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల నటించ లేకపోయింది.
దీనికితోడు సినిమా పరిశ్రమలో నిలకడ లేమి కారణంగా కూడా ప్రియా ఆనంద్ అవకాశాలను దక్కించుకోలేక పోయింది.
అయితే తెలుగులో ప్రియా ఆనంద్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, సిద్ధార్థ, రానా దగ్గుబాటి, శర్వానంద్, తదితర హీరోలతో కలిసి నటించింది.
కానీ ఈ అమ్మడు ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం రెండో హీరోయిన్ మరియు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కనిపించింది.
దీంతో ఈ అమ్మడుకంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా కష్ట పడుతోంది.
తెలుగులో చివరగా ప్రియా ఆనంద్ "త్రిష లేదా నయనతార" అనే తమిళ డబ్బింగ్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు.అయితే ప్రియా ఆనంద్ హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకొక పోయినప్పటికీ మలయాళం, కన్నడ, తమిళ భాషలలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమిళ ప్రముఖ దర్శకుడు ఎస్పీ హొస్మిన్ దర్శకత్వం వహిస్తున్న "సుమో" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.దీంతో ఇటీవలే కన్నడలో నూతన దర్శకుడు చైతన్య కుమార్ దర్శకత్వం వహిస్తున్న "జేమ్స్" అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.