అలాంటి పనులు చేస్తూ పోలీసులకు దొరికిపోయిన తెలుగు హీరోయిన్....

సినిమా పరిశ్రమ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ మరియు మాదక ద్రవ్యాల వినియోగం వంటి విషయాలు బాగానే కలకలం రేపుతున్నాయి.

గతంలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఈ డ్రగ్స్ వ్యవహారం కారణంగా చాలా మంది సినిమా సెలబ్రిటీలు సఫర్ అయ్యారు.

అయితే తాజాగా ముంబైలో మరోమారు ఈ మాదక ద్రవ్యాల వినియోగం మరియు సరఫరా కలకలం సృష్టించింది.

ఇందులో భాగంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నటిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

"""/"/ పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా ముంబై పరిసర ప్రాంతంలో ని ఓ ప్రముఖ హోటల్ లో మాదక ద్రవ్యాల వినియోగం మరియు సరఫరా జరుగుతుందని పోలీసులకు సమాచారం అందడంతో హోటల్ పై రైడ్ చేశారు.

అయితే ఇందులో బర్త్ డే పార్టీ జరుపుకుంటుండుగా టాలీవుడ్ హీరోయిన్ నైరా నేహాల్ షాతో పాటు మరికొంతమంది మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా వ్యవహారం కలకలం రేపుతోంది.

అంతే కాకుండా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా.

? అసలు ఈ డ్రగ్స్ పుట్టిన రోజు పార్టీలోకి ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ విషయం ఇలా ఉండగా నైరా నెహాల్ షా తెలుగులో బుర్రకథ, ఇ.

ఈ., తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.దీంతో నైరా నెహాల్ షా గురించి ప్రేక్షకులకి పెద్దగా తెలియదు.

మరి అనుకోకుండా ఈ అమ్మడు డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులకు చిక్కడంతో ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాల షూటింగుల పరిస్థితి ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

వీడియో వైరల్: అత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు.. ఎక్కడంటే..