ఇంకా షూటింగ్ మొదలు కాక ముందే వెంకీ కోసం 45 లక్షలు ఖర్చు పెట్టారట....

చలన చిత్ర పరిశ్రమలో సినిమాలను తెరకెక్కించే సమయంలో ఒక్కోసారి తాము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువయి సినిమా షూటింగులు అర్ధాంతరంగా ఆగిపోయి నిలిచిపోయిన చిత్రాలు సినిమా ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.

కానీ సినిమా ఫలితంపై ఖచ్చితమైన నమ్మకం ఉంటే దర్శకనిర్మాతలు కోట్ల రూపాయలు వెచ్చించడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు.

కాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావు మరియు టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన సుందరకాండ చిత్రం నిర్మించే సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.

అయితే ఈ చిత్రంలో హీరో విక్టరీ వెంకటేష్ కి జోడీగా మలయాళం బ్యూటిఫుల్ హీరోయిన్ మీనా నటించగా అపర్ణ రెండో హీరోయిన్ గా నటించింది.

కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.

కీరవాణి సంగీత స్వరాలు సమకూర్చాడు.దాంతో ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రం సుందరకాండం అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు.

కాగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన కె.వి.

వి.సత్యనారాయణ సుందరకాండ సినిమా సినిమా రైట్స్ కోసం చాలా కష్టపడ్డారు.

ముందుగా ఈ చిత్రం తమిళంలో మంచి హిట్ అవడంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాగ్యరాజా తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేశాడట.

ఈ విషయం తెలుసుకున్న కె.వి.

వి.సత్యనారాయణ ఎలాగైనా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని పట్టుబట్టి తెలుగు డబ్బింగ్ ఆపి దాదాపుగా 25 లక్షల రూపాయలు భాగ్యరాజాకి చెల్లించడంతో పాటూ అప్పటికే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన ఇతర డిస్ట్రిబ్యూటర్లకు కూడా దాదాపుగా 20 లక్షల రూపాయలు చెల్లించారు.

"""/"/ అనంతరం ఈ చిత్రంపై పూర్తి హక్కులను దక్కించుకున్న తర్వాత తెలుగులో రీమేక్ చేసి విడుదల చేయగా ఆశించిన స్థాయిలో హిట్ అయ్యింది.

అంతేగాక దర్శక నిర్మాతలకి కలెక్షన్ల వర్షం కురిపించింది.దీంతో సినీ నిర్మాత కె.

వి.వి.

సత్యనారాయణ కూడా ఈ చిత్రం నుంచి ఎలాంటి నష్టాల బారిన పడకుండా బయట పడ్డారు.

దీంతో కథపై నమ్మకం ఉంటే కచ్చితమైన ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కొందరు సినీ విమర్శకులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ చిత్రం లోని ఆకాశాన సూర్యుడుండడు అనే పాట ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ సాంగ్స్ లిస్ట్ లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ఈ విషయంలో ఇలా ఉండగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

కాగా ఈ ఏడాది నారప్ప చిత్రంతో విజయాల ఖాతా తెరిచిన వెంకటేష్ దృశ్యం 2 చిత్రంతో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం తెలుగు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 3 ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

వైసీపీకి సోషల్ మీడియానే బలం..: సీఎం జగన్