ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమై టాలీవుడ్ మన్మథుడు గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు అయితే నాగార్జున ఈ మధ్యకాలంలో ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలలో హీరోగా నటిస్తూ దూసుకుపోతున్నాడు.

అంతే కాకుండా మరో పక్క తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ లో హోస్టింగ్ నిర్వహిస్తూ బాగానే అలరిస్తున్నాడు.

అయితే మొదటిగా అక్కినేని నాగార్జున సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన తండ్రి పేరు ప్రఖ్యాతలను ఏ మాత్రం ఉపయోగించుకోకుండా తన ప్రతిభను నిరూపించుకునే స్టార్ హీరో హోదాని దక్కించుకున్నాడు.

అలాగే ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ యంగ్ లుక్ లో అదరగొడుతున్నాడు.

కాగా తాజాగా అక్కినేని నాగార్జున కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే హీరో నాగార్జున చిన్నప్పటినుంచి ఇప్పటివరకు తీసినటువంటి ఫోటోలు నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో కొందరు అక్కినేని నాగార్జున అభిమానులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

అంతే కాకుండా చిన్నప్పుడు నాగార్జున చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

"""/" / ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే హీరో నాగార్జున తెలుగులో వైల్డ్ డాగ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే అలరించింది.మంచి విజయంతో ఏడాదిని ఆరంభించిన నాగార్జున కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులను నిలిపివేయడంతో రెండో హిట్టు ఖాతాలో వేసుకోలేక పోయాడు.

దీంతో ప్రస్తుతం హీరో నాగార్జున తెలుగులో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న బంగార్రాజు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో హీరో నాగార్జున జంటగా తెలుగు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుండగా హీరో అక్కినేని నాగచైతన్య మరియు బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి గెస్ట్ పాత్రలలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ చెప్పేవన్నీ బోగస్ మాటలే..: హరీశ్ రావు