తెలుగులో ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఇష్టమైన నటుడెవరో తెలుసా..?

తెలుగు భాషలలోనే కాక దాదాపుగా 16 భాషలలో పాటలు పాడి తన మధురమైన గానంతో యావత్ దేశాన్ని మైమరిపించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందినప్పటికీ ఆయన మధుర జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను వెంటాడుతూనే ఉన్నాయి.

 అయితే  ఆ మధ్య ఓ ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఇష్టమైన నటీనటుల గురించి ప్రస్తావించాడు.

అయితే ఇందులో భాగంగా తనకు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాత మరియు హాస్య నటుడు "అల్లూ  రామలింగయ్య" అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు.

 అలాగే తమిళంలో అయితే తనకు కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు.

ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే తాను అందరి హీరోలని అభిమానిస్తానని అంతేగాక ప్రతి ఒక్కరితోనూ తనకి చాలా దగ్గరి అనుబంధం ఉందని కాబట్టి అందరూ తనకు చాలా స్పెషల్ అని తెలిపాడు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే తన స్నేహితుడయినటువంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మరియు మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా చాలా ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి అని ఒక పాటకి ప్రాణం పోసేందుకు ప్రాణం పెడతాడని అంత డెడికేషన్ మరియు టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటివరకు తాను చూడలేదని తెలిపాడు.

అయితే ఇళయరాజాతో జరిగినటువంటి ఓ సంఘటన తనను కొంతమేర బాధించిందని ఎమోషనల్ అయ్యాడు.

 అయితే ఆ సంఘటన ఏమిటంటే తాను అమెరికా మరియు ఇతర దేశాల్లో సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడుతూ ఉండగా ఇళయరాజా తన చిత్రాల్లో పాడిన పాటలను బయట మరెక్కడా పాడకూడదని అంటూ ఏకంగా లీగల్ నోటీసులు పంపించాడని ఆ విషయం వల్ల తాను ఇప్పటికీ కూడా ఇళయరాజా తో మాట్లాడ లేదని చెప్పుకొచ్చాడు.

 అంతేగాక  అలాంటి నోటీసులు పంపించక ముందు తనతో తన చిత్రంలోని పాటలను బయట పాడొద్దని చెప్పి ఉంటే కచ్చితంగా పాడకుండా ఉండేవాడినని లీగల్ నోటీసులు ఎందుకు పంపించాడో ఇప్పటికీ తనకి అర్థం కాలేదని తెలిపాడు.

ఏదేమైనప్పటికీ  ఓ లెజెండరీ గాయకుడు కన్నుమూయడంతో సంగీత ప్రపంచానికి తీరని లోటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?