ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుని సర్వం పోగొట్టుకుని… చివరికి…
TeluguStop.com
సినిమా పరిశ్రమలో కొంత మంది హీరో హీరోయిన్లు స్టార్లుగా రాణించినప్పటికీ తమ వైవాహిక జీవితంలో చేసిన తప్పుల కారణంగా భారీగా మూల్యం చెల్లించుకున్న ఘటనలను ఇప్పటివరకు చాలానే చూశాం.
అయితే ఒకప్పుడు తమ నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు కట్టిపడేసిన ప్రముఖ స్వర్గీయ నటుడు నందమూరి తారక రామారావు మరియు అక్కినేని అందగాడు అక్కినేని నాగేశ్వర రావు తదితర స్టార్ హీరోల సరసన నటించిన "ప్రముఖ సీనియర్ నటి దేవిక" గురించి ఇప్పటి తరం ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు గానీ 80 సంవత్సర కాలంలోని ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుంటుంది.
అయితే అప్పట్లో నటి దేవిక తెలుగు, తమిళ భాషలలోని స్టార్ హీరోలతో వరుస చిత్రాలతో నటిస్తూ బాగానే రాణించింది.
దీంతో తెలుగు, తమిళంలో బాగా పేరొందిన ఓ స్టార్ హీరోయిన్ దేవిక కు సినిమా అవకాశాల విషయంలో అడ్డు పడుతున్నారని అప్పట్లో టాక్ వినిపించింది.
అయినప్పటికీ స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామా రావు మాత్రం దేవిక కు దాదాపుగా తెలుగులో 20 కి పైగా చిత్రాలలో నటించే అవకాశాలను ఇప్పించాడని అంతగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండేదని ఇప్పటికీ చాలా మంది అంటుంటారు.
అయితే వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో దేవిక సినిమా పరిశ్రమలో పలు చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన "దేవదాసు" అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత తన భర్తని దర్శకుడిగా సినిమా పరిశ్రమకు పరిచయం చేసేందుకుగాను తాను కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తులను అమ్మేసింది.
అయినప్పటికీ తన భర్త మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయాడు.దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు వచ్చాయి.
"""/"/
కానీ అప్పటికే వీరిద్దరికీ కనక అనే ఓ పాప కూడా ఉంది.అయినప్పటికీ దేవిక తన భర్త నుంచి దూరంగా ఉండేది.
ఇక చివరిగా తెలుగులో "వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర" అనే చిత్రంలో ఓ పాత్రలో కనిపించింది.
కానీ ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించ లేదు.దీంతో చివరి రోజుల్లో దేవిక ఒంటరిగానే కాలం గడుపుతూ మరణించింది.
కొంతకాలం తరువాత దేవిక కూతురు కనక కూడా పలు తమిళ మలయాళ హిట్ చిత్రాల్లో నటించింది.
కానీ ఈమె కూడా అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయింది.
సినిమాల పరంగా మంచి ఫేమ్ మరియు స్టార్ డమ్ సంపాదించుకున్న సీనియర్ నటి దేవిక తన వైవాహిక జీవితం కారణంగానే చివరి రోజుల్లో ఒంటరి తనం అనుభవించిందని ఆమె అభిమానులు చెబుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్17, మంగళవారం 2024