తెలుగు సినిమా లను ఓటీటీ లు నాశనం చేస్తున్నాయి అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ నుండి విడుదల అవుతున్న సినిమా లు ఈమద్య కాలంలో వెంటనే ఓటీటీ ల ద్వారా వస్తున్న కారణంగా థియేటర్ కు వెళ్లి చూస్తున్న వారి సంఖ్య చాలా తగ్గుతుంది.
మూడు వారాలు వెయిట్ చేస్తే ఓటీటీ లో వస్తున్నందుకు వేలకు వేలు పెట్టి ఎందుకు థియేటర్ కు వెళ్లాలి అని చాలా మంది భావిస్తున్నారు.
అందువల్ల ఇప్పుడు థియేటర్ ల ద్వారా వస్తున్న ఆదాయం చాలా వరకు తగ్గింది.
సూపర్ హిట్ అంటూ సినిమాకు టాక్ వచ్చినా కూడా వస్తున్న వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.
అందుకే ఓటీటీ లో సినిమా ను విడుదల చేసేందుకు ఎనిమిది వారాల గ్యాప్ ఉండాల్సిందే అంటూ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా లు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వడానికి ఎనిమిది వారాలు లేదా 50 రోజుల సమయం కావాల్సిందే అంటూ పేర్కొన్నాడు.
కాని అది ఎంత వరకు సాధ్యం అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.
ఏ ఒక్కరు కూడా అలాంటి కమిట్మెంట్ కు ఒప్పుకునే పరిస్థితి లేదు.ఓటీటీ లో సినిమా ను ఎంత త్వరగా స్ట్రీమింగ్ చేస్తే నిర్మాత కు అంత ఎక్కువ గా లాభాలు వస్తున్నాయి.
అందుకే ఓటీటీ లో తమ సినిమా లను వెంటనే స్ట్రీమింగ్ చేయాలని కొందరు అనుకుంటే కొందరు మాత్రం వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారు.
మొత్తానికి ఇండస్ట్రీలో ప్రస్తుత ఈ పరిస్థితి విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఆహా వంటి ప్రాంతీయ ఓటీటీ ల్లో సినిమా లు విడుదల చేసే విషయం లో నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ముఖంపై నలుపు పేరుకుపోయిందా.. సులభంగా వదిలించుకోండిలా..!