ఆ సినిమా తీస్తున్నప్పుడు హీరోతో గొడవ జరిగిన మాట వాస్తవమే... కానీ...

తెలుగులో 2007వ సంవత్సరంలో టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన "ఎవడైతే నాకేంటి" చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.సముద్ర దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత సామ చంద్రశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

కాగా ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ ఆర్మీ మరియు పొలిటిషన్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆలోచించాడు.

అయితే తాజాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు వి.

సముద్ర ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా ఎవడైతేనాకేంటి చిత్రాన్ని తమిళంలో మంచి విజయం సాధించిన "ఉడంబు ఎప్పాడి ఇరుక్కు" అనే చిత్రం ద్వారా కాపీ కొట్టామని తెలిపాడు.

అంతేకాకుండా మరో నాలుగు తమిళ చిత్రాల రెఫరెన్స్ లను కూడా తీసుకొని తెరకెక్కించామని అందువల్లనే "ఎవడైతే నాకేంటి" చిత్రం తెలుగులో మంచి విజయం సాధించిందని తెలిపాడు.

అయితే ఈ చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో డాక్టర్ రాజశేఖర్ తనపై ఎంతగానో నమ్మకం ఉంచాడని అందువల్లనే ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నానని దర్శకుడు వి.

సముద్ర తెలిపాడు.అంతేకాక ఒక సినిమా నుంచి పూర్తిగా సన్నివేశాలను లేదా ఇతర అంశాలను రీమేక్ చేయలేమని కేవలం 40 శాతం మాత్రమే ఉపయోగించుకోగలమని అందువల్లనే మరో నాలుగు చిత్రాలను రిఫరెన్స్ గా తీసుకున్నామని కూడా వివరించాడు.

అలాగే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో హీరో రాజశేఖర్ మరియు జీవితతో తనకు చిన్నపాటి విభేదాలు ఏర్పడిన మాట వాస్తవమేనని కానీ తర్వాత ఆ చిత్రాన్ని తానే పూర్తి చేశానని కూడా తెలిపాడు.

అలాగే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కోసం చాలా కష్టాలు పడ్డానని, కానీ ఈ చిత్ర ఫలితం తన కష్టాలు అన్నింటినీ దూరం చేసిందని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఒకానొక సమయంలో సింహరాశి, మహానంది, విజయ దశమి, అధినేత, తదితర బ్లాక్బస్టర్ హిట్లను తీసినటువంటి దర్శకుడు వి.

సముద్ర ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.కాగా ఇటీవలే శ్రీకాంత్ మరియు సునీల్ హీరోగా తెరకెక్కిన జై సేన అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.

కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.దీంతో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది.

డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం.. వైరల్ వార్తల్లో నిజమెంత?