ఆ పదవిని కోల్పోయిన జానీ మాస్టర్.. ఇకపై ఈ మాస్టర్ కు కొత్త ఆఫర్లు కష్టమేనా?

తెలుగు ప్రేక్షకులకు ప్రేమకు కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ( Dance Master Johnny Master )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్.

మరిముఖ్యంగా ఢీ షో తో భారీగా పాపులీరిటీని సంపాదించుకున్నారు.ఇకపోతే మొన్నటి వరకు సోషల్ మీడియాలో జానీ మాస్టర్ పేరు ఒక రేంజ్ లో మారుమోగిన విషయం తెలిసిందే.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు.లైంగిక ఆరోపణ కేసులో ఆయన ఎదుర్కొన్న విమర్శలు అన్ని ఇన్ని కావు.

అయితే లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి, ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన జానీ మాస్టర్‌ కి ఊహించని షాక్ తగిలింది.

"""/" / ఈయన్ని డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ( Dance Directors Association )నుంచి శాశ్వతంగా తొలగించారట.

ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది.కాగా మొన్నటి వరకు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చాడు.

ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో, ఇతడి పదవిపై అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి.

అందుకు తగ్గట్లే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.జోసెఫ్ ప్రకాశ్ ( Joseph Prakash )విజయం సాధించారు.

5వ అధ్యక్షుడిగా కూడా ఆయన ఎన్నికయ్యారు.అలాగే పోలీసులు అరెస్ట్ చేసేనాటికి టాప్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చాడు.

"""/" / నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది.కానీ కేసు కోర్ట్ గొడవల వల్ల ఆ పురస్కారాన్ని రద్దు చేశారు.

ఇప్పుడు ఆయన బదులు వేరే కొరియోగ్రాఫర్స్‌ కి అవకాశమివ్వాలని పలువురు దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

ప్రస్తుతం టాలీవుడ్ ఇదే వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.దీంతో పలువురు జానీ మాస్టర్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

అంటే ఇక మీదట జానీ మాస్టర్ కు అవకాశాలు రావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఈ విషయంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

షాకింగ్ వీడియో: రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?