బాత్ రూమ్ సీన్లు హీరోయిన్లు చేస్తే ఒకే కానీ, మేము చేస్తే మాత్రం తప్పంటారు

తెలుగులో లేడీ కమెడియన్, బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలను కనిపించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ "రమ్య శ్రీ" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే నటి రమ్య శ్రీ సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో మూడు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.

కానీ ఆ చిత్రాలు ఈ అమ్మడికి పెద్దగా ఉపయోగ పడలేదు.దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైంది.

కాగా తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తాను 19 సంవత్సరాలు ఉన్నప్పుడే హీరోయిన్ అవ్వాలని తన ఇంట్లో వాళ్లకి చెప్పకుండా హైదరాబాద్ కి వచ్చానని, ఆ తర్వాత తన జాడ తెలుసుకున్న కుటుంబ సభ్యులు తన దగ్గరికి వచ్చి పలు చిత్ర హింసలకు గురి చేశారని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా తాను సినిమాల్లో నటించడం తమ కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం లేదని అందువల్లనే తనని ఇంట్లో నుంచి గెంటేశారని ఎమోషనల్ అయ్యింది.

దాంతో తాను దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నానని ఆ తర్వాత ఇతరులు సర్ది చెప్పడంతో ఈ మధ్య వారి యోగక్షేమాల గురించి తెలుసుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

ఇక ఇప్పటి వరకు తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదనే విషయంపై స్పందిస్తూ రోజూ తన నిత్య జీవితంలో చాలా మంది పెళ్లయి విడిపోయిన జంటలను చూస్తూ ఉంటానని, అంతేగాక టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది సినిమా హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయారని అందువల్లనే తాను పెళ్లి జీవితానికి దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది.

ఇక తాను ఒకప్పుడు టాలీవుడ్ లో హీరో నాగార్జున చిత్రాలలో మినహాయించి, దాదాపుగా అందరి స్టార్ హీరోల చిత్రాలలో కమెడియన్ గా మరియు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించానని చెప్పుకొచ్చింది.

కానీ ఇందులో ఏదైనా బాత్ రూమ్ లో నటించే సన్నివేశంలో హీరోయిన్లు నటిస్తే పెద్దగా పట్టించుకోరు కానీ తమలాంటి ఆర్టిస్టులు ఒంటికి టవల్ చుట్టుకుని బాత్ రూమ్ సన్నివేశాల్లో నటిస్తే కొంత మంది వ్యాంప్ మరియు బోల్డ్ అంటూ కామెంట్లు చేస్తారని ఇది సరికాదని తన అభిప్రాయాన్ని తెలిపింది.

 అంతేకాక హీరోయిన్ల మాదిరిగానే తాము కూడా నటిస్తానని కానీ తనని కొంతమంది చిన్నచూపు చూస్తారని ఈ విషయం చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ ఎవరు వినిపించుకోవడం లేదని తన ఆవేదనని వ్యక్తం చేసింది.

అలాగే ఏదైనా సరే మనం చూసే చూపు ని బట్టి ఉంటుందని అంతేతప్ప ఒక నటిగా తన పాత్రకి న్యాయం చేయడం తన వృత్తి ధర్మమని నటి రమ్య శ్రీ స్పష్టం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య "ఓ మల్లి" అనే ఈ చిత్రంలో హీరోయిన్ గా రమ్యశ్రీ నటించింది.

అంతేగాక ఈ చిత్రానికి దర్శకత్వం, నిర్మాతగా కూడా వ్యవహరించింది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో పూర్తిగా నష్టాలను చవి చూసింది.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో మ్యాటర్ తగ్గుతుందా..? ఇప్పుడు వచ్చే సినిమాల పరిస్థితి ఏంటి..?