బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ముందు తనని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమని చెప్పారట…
TeluguStop.com
తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి హేమ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే నటి హేమ గత ఏడాది ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ షోలో పాల్గొని ఎలిమినేట్ అయిన అనంతరంప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే నటి హేమని బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనేముందు షో నిర్వాహకులు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమెకి కి చెప్పారట.
అయితే ఈ విషయం గురించి ఆమె వివరణ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లో దాదాపుగా మూడు నెలల పాటు ఉండాల్సి వస్తుందని దాంతో ఒకవేళ గర్భవతిగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అంతేగాక స్కిట్లు, డ్యాన్సలలో అటూ ఇటూ కదిలినప్పుడు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందువల్లనే షో నిర్వాహకులు ఆ విషయం గురించి తనకు ముందే చెప్పారని అందులో తప్పు గా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.
అంతేగాక బిగ్ బాస్ మూడవ సీజన్ లో తనతో పాటు పాల్గొన్నటువంటి కంటెస్టెంట్ల స్వభావం గురించి కూడా హేమ ప్రేక్షకులతో పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హేమ తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తోంది.
అంతేకాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ లో మెంబెర్ గా తన సేవలను అందిస్తోంది.
ఇబ్బందిగా ఫీలైతే ఒక్క క్షణం కూడా ఉండొద్దు.. పూరీ జగన్నాథ్ కామెంట్స్ వైరల్!