తెలుగు ‘బ్రో డాడీ’ స్క్రిప్ట్ చర్చల్లో మెగాస్టార్?
TeluguStop.com
మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ ని( Bro Daddy ) తెలుగు లో రీమేక్ చేస్తున్నారు.
చిరంజీవి.సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సుస్మిత కొణిదెల( Sushmita Konidela ) నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో చిరంజీవి చాలా ప్రత్యేకంగా స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తున్నాడు.
ఇప్పటికే రెడీగా ఉన్న స్క్రిప్ట్ చర్చల్లో చిరంజీవి పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.చిరంజీవి తన అనుభవం తో కొన్ని మార్పులు చేర్పులు సూచించడంతో పాటు మంచి వినోదాన్ని కూడా పండించే విధంగా సినిమా ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
మొత్తానికి బ్రో డాడీ సినిమా ను ఓ రేంజ్ ఎంటర్ టైనర్ గా రూపొందించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
"""/" /
అందుకే బ్రో డాడీ సినిమా తెలుగు లో చక్కటి ప్లానింగ్ తో తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) డీజే టిల్లు సినిమా తో ఆకట్టుకున్న విషయం తెల్సిందే.
అందుకే ఈ సినిమా లో ఆయన నటించడం వల్ల మరింతగా సినిమా కు పాపులారిటీ దక్కే అవకాశం ఉంది.
చిరంజీవి.( Chiranjeevi ) సిద్దు కలిసి నటించడం వల్ల వచ్చే పాపులారిటీ కి తగ్గట్లుగా హీరోయిన్స్ ఉండాల్సిన అవసరం ఉంది.
అందుకే బ్రో డాడీ మూవీ రీమేక్ కోసం త్రిష.శ్రీలీల ను ఎంపిక చేయడం జరిగిందట.
"""/" /
ఈ విషయమై ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఆ విషయమై మరింత స్పష్టత రావడం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న బ్రో డాడీ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ లో మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
అదే జరిగితే సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే నెలలో భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లగా ప్రారంభం అయ్యాయి.మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
సమ్మర్ స్పెషల్.. వెయిట్ లాస్ కు బెస్ట్ జ్యూస్ ఇది..!