వరుసగా రెండో విక్టరీ కొట్టిన హైదరాబాద్ టీమ్…మెరిసిన తెలుగు తేజం…
TeluguStop.com
ఐపీఎల్ లో( IPL ) ఉన్న ప్రతి టీం తమదైన రీతిలో వరుస విజయాలను అందుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్( Sun Risers Hyderabad ) టీం మొదట్లో కొంచెం తడబడినప్పటికీ ఇప్పుడు మాత్రం మంచి జోరు మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది.
వరుసగా రెండు విజయాలు నమోదు చేసుకొని హైదరాబాద్ టీమ్ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తు ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ టీం కి కెప్టెన్ ను మార్చిన తర్వాత ఆ టీం కి చాలా వరకు కలిసి వస్తుందనే చెప్పాలి.
"""/" /
ఇక కెప్టెన్ గా పాట్ కమ్మీన్స్( Pat Cummins ) తీసుకునే డిసిజన్స్ కూడా టీం విజయంలో కీలకపాత్ర వహిస్తున్నాయి.
ఇక నిన్న పంజాబ్ తో( Punjab ) జరిగిన మ్యాచ్ లో 2 పరుగుల తేడా తో ఘన విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక ఈ మ్యాచ్ లో మన తెలుగు తేజం అయిన నితీష్ రెడ్డి( Nitish Reddy ) హాఫ్ సెంచరీ చేసి తన సత్తా చాటుకున్నాడు.
ఇక టీమ్ మొత్తాన్ని ముందుండి నడిపించడంలో సక్సెస్ అయ్యాడు.ఇక ఈయనే "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" కూడా నిలవడం తెలుగు వాళ్ళందరికి సంతోషకరమైన విషయమనే చెప్పాలి.
ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ టీమ్ కూడా చివరి వరకు పోరాడినప్పటికీ అంతిమ విజయం మాత్రం హైదరాబాద్ కి దక్కడం విశేషం.
ఇక ఇదే ఊపులో కనక హైదరాబాద్ మిగితా మ్యాచ్ లను కనక ఆడితే ఈసారి కప్పు హైదరాబాద్ కొడుతుంది అనదం లో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు.
"""/" /
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 182 పరుగులు చేసింది.
అందులో నితీష్ రెడ్డి 37 బంతుల్లో 5 సిక్సులు, నాలుగు ఫోర్లతో 64 పరుగులు చేశాడు.
ఇక బౌలింగ్ లో భువనేశ్ కుమార్ మొదట్లోనే రెండు వికెట్లు తీసి పంజాబ్ టీం ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
దానివల్లే హైదరాబాద్ టీమ్ కి విజయం వరించింది.లేకపోతే మాత్రం ఈ టీమ్ ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది.
ఇక ఇప్పటివరకు హైదరాబాద్ టీమ్ 5 మ్యాచ్ లు ఆడగా అందులో మూడు మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో ఫిఫ్త్ పొజిషన్ కొనసాగుతుంది.
నటి శోభిత కౌంట్ డౌన్ మొదలు… ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత?