తెలుగు బిగ్‌బాస్‌…అనౌన్స్మెంట్‌ విషయంలోనూ అదే తీరు

తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 7( Telugu Bigg Boss 7 ) ప్రారంభం కు అంతా రెడీగా ఉంది.

మరో పదిహేను రోజుల్లో షో ను పట్టాలెక్కించేందుకు గాను కంటెస్టెంట్స్ తుది ఎంపిక కూడా పూర్తి అయింది.

వారు రెండు మూడు రోజుల్లో తమ హెల్త్‌ రిపోర్ట్స్ ను షో నిర్వాహకులకు ఇవ్వాల్సి ఉంటుంది.

అంతే కాకుండా మరో వారం రోజుల్లోనే వారు అన్నపూర్ణ స్టూడియో( Annapurna Studio )కు వెళ్లాల్సి ఉంటుంది.

కంటెస్టెంట్స్ విషయం లో ఎలాంటి క్లారిటీ లేదు.కొందరి పేర్లు ప్రచారం జరిగాయి.

అయితే వారు తుది జాబితాలో ఉంటారా లేదా అనే విషయం లో స్పష్టత లేదు.

ఇక ఈ సారి మొత్తం తలకిందు అన్నట్లుగా జరుగుతుందని నాగార్జున( Nagarjuna ) చెబుతూ వస్తున్నాడు.

"""/" / ప్రేక్షకులు ఊహించినట్లుగా ఏ ఒక్కటి జరగదు.అలాగే షో లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా మొత్తం మతి పోయే విధంగా టాస్క్‌ లు ఉండబోతున్నాయట.

దాంతో కచ్చితంగా షో కు మంచి టాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయం పక్కన పెడితే సెప్టెంబర్‌ మొదటి వారంలోనే ఈ షో ను ప్రారంభించబోతున్నారు.

సాధారణంగా అయితే నెల రోజుల ముందే షో టైమ్‌ ను డేట్‌ ను ప్రకటిస్తారు.

కానీ ఇప్పటి వరకు సీజన్‌ 7 యొక్క టెలికాస్ట్‌ డేట్‌( Bigg Boss 7 Telecast Date ) ను ప్రకటించలేదు.

దాంతో ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. """/" / ఈ కుడి ఎడమైతే అనే కాన్సెప్ట్‌ డేట్ ఫైనల్‌ విషయం నుండే ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సాధారణంగా షో ఆదివారం( Sunday ) ప్రారంభం అవుతుంది.కానీ ఈసారి వీక్ మద్య లో షో ప్రారంభించాలని భావిస్తున్నారు.

షో అనౌన్స్మెంట్‌ విషయంలోనే ఇంత సస్పెన్స్ ను క్రియేట్‌ చేస్తున్న బిగ్‌బాస్( Bigg Boss ) నిర్వాహకులు ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటారో అర్థం చేసుకోవచ్చు.

ఆచార్య ప్లాప్ కి కారణం ఎవరు..? ఎవరిని ఉద్దేశించి కొరటాల కామెంట్లు చేశాడు…