బిగ్‌ బాస్ లో షకీలా… రేటింగ్ కోసం చెత్త నిర్ణయం

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 7 ( Biggboss Season 7 )ప్రారంభం అయింది.

ఎప్పుడూ కూడా కంటెస్టెంట్స్ విషయం లో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

గతంలో ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్‌ సెలబ్రెటీలను తీసుకు వచ్చి మా నెత్తిన కూర్చోబెట్టారు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.

అందుకే ఈసారి సోషల్ మీడియా సెలబ్రెటీలకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా సినిమా ఇండస్ట్రీ వారికి మరియు బుల్లి తెర వారికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

"""/" / అందులో భాగంగానే ఏ గ్రేడ్‌ సినిమా లు చేసి పాన్ ఇండియా స్థాయి గుర్తింపు దక్కించుకున్న నటి షకీలా ( Shakeela )ను ఎంపిక చేయడం జరిగింది.

ఆమె సినిమా లు మరియు ఆమె వీడియో లు ఒకప్పుడు చాలా ఫేమస్.

స్టార్‌ హీరోల సినిమా లకు సైతం చెమటలు పట్టించే స్థాయి లో షకీలా సినిమా లు నడిచాయి.

అలాంటి షకీలాను బిగ్‌ బాస్ లోకి తీసుకు రావడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఈ తరం యువతను చెడగొట్టడం తప్ప మరేం లేదని, ఇలాంటి నిర్ణయాలు రేటింగ్ కోసమే తప్ప, ప్రేక్షకుల మనసును అర్థం చేసుకుని కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / మొత్తానికి బిగ్‌ బాస్ లో షకీలా( Shakeela ) ఉండటం అనేది నిర్వాహకులు తీసుకున్న చెత్త నిర్ణయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇలాంటి కంటెస్టెంట్‌ వల్ల షో స్థాయి తగ్గుతుందని పేర్కొన్నాంటున్నారు.

అంతే కాకుండా షో నిర్వాహకులు ఇతర కంటెస్టెంట్స్ విషయం లో నార్మల్‌ గానే ఉన్నా కూడా షకీలా విషయానికి వచ్చేప్పటికి కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారేమో అనిపిస్తుంది.

షకీలా ను అయితే ఎంపిక చేశారు, ఆమె ఎన్ని వారాల వరకు కొనసాగే అవకాశం ఉంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.