బిగ్ బాస్ 6.. హోస్ట్ కంటెస్టెంట్స్ పారితోషికం ఎంతో క్లారిటీ

తెలుగు బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలు కాబోతుంది.సెప్టెంబర్‌ 4వ తారీకున బిగ్ బాస్ సీజన్ 6 ను ప్రారంభించబోతున్నట్లుగా స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

షో కు సంబంధించిన సెట్‌ నిర్మాణం పూర్తి అయ్యింది.అంతే కాకుండా బిగ్‌ బాస్ కంటెస్టెంట్స్ తుది జాబిత కూడా దాదాపుగా పూర్తి అయ్యింది.

అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి.మరో మూడు నాలుగు రోజుల్లోనే ఫైనల్‌ కంటెస్టెంట్స్ ను కరోనా టెస్ట్‌ చేయించి క్వారెంటైన్ కి పంపించబోతున్నారు.

వారం నుండి పది రోజుల పాటు హోటల్‌ లో కంటెస్టెంట్స్ ఉంటారు.ఆ తర్వాత మాత్రమే వారు బిగ్ బాస్ హౌస్‌ కి వెళ్లబోతున్నారు.

ఇక ఈ సీజన్‌ లో కూడా నాగార్జున హోస్ట్‌ గా చేయబోతున్నాడు.గత సీజన్ లో హోస్ట్‌ గా చేసినందుకు గాను నాగార్జున రూ.

12.5 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నాడట.

ఇప్పుడు ఆ మొత్తం ను రూ.15 కోట్ల కు పెంచినట్లుగా సమాచారం అందుతోంది.

నాగార్జున తో పాటు షో లో ఈసారి పలువురు కంటెస్టెంట్స్ కు కూడా భారీ పారితోషికం ను ఇవ్వబోతున్నారట.

"""/"/ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రతి వారంకు కంటెస్టెంట్స్ కు ఇవ్వబోతున్న పారితోషికం కోటి రూపాయలు గా చెబుతున్నారు.

ఈసారి పారితోషికం కాస్త ఎక్కువగానే కంటెస్టెంట్స్ కు ఇవ్వబోతున్న నేపథ్యం లో కచ్చితంగా ఎంటర్‌ టైన్మెంట్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లో ఈ సీజన్ కంటెస్టెంట్స్ విషయం లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఉదయ భాను ప్రథమ ప్రియారిటీ గా తీసుకున్నారట.ఇక బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చే ఆదికి కూడా ఛాన్స్ దక్కింది.

సిరి హనుమంతు యొక్క ప్రియుడు శ్రీహాన్‌ కి కూడా ఛాన్స్ దక్కింది.ఈసారి ముగ్గురు సామాన్యులకు ఛాన్స్ దక్కడం తో సందడి మామూలుగా లేదు.

పారితోషికం భారీగా ఇస్తున్న నేపథ్యం లో భారీ రేటింగ్‌ ను స్టార్‌ మా ఆశిస్తోంది.

మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని చంపాలని సూప్‌లో విషం కలిపింది.. కట్ చేస్తే షాక్..?