బిగ్‌ బాస్ : నాల్గవ వారం ఎలిమినేషన్ పై స్పష్టత వచ్చేసింది

తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

భారీ అంచనాలు భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ ఈ షో కి మంచి ఆదరణ లభిస్తోంది.

కంటెస్టెంట్స్ విషయం లో మొదటి వారంలో విమర్శలు ఎదుర్కొన్నా ఆ తర్వాత మాత్రం షో గురించి జనాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

స్టార్ మా బిగ్బాస్ మాదిరి గానే ఇక్కడ కూడా మంచి టాక్ రావడం తో.

ప్రేక్షకులు నుండి వస్తున్న రెస్పాన్స్ తో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికి మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది.

మొదటి మూడు వారాల్లో మొదటి వారం ముమైత్ ఖాన్ రెండవ వారంలో శ్రీ రాపాక మూడవ వారంలో చైతూ లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో స్పష్టత వస్తుంది.నాలుగో వారంలో ఎలిమినేషన్‌ కి నామినేట్‌ అయిన వారి లో అతి తక్కువ ఓట్లు అనిల్ మరియు మిత్ర శర్మ లకు దక్కినట్లు తెలుస్తోంది.

వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్‌ అవ్వడం లేదా ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది.ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ అయితే వీరిద్దరు పక్కగా ఎలిమినేట్ బయటికి వెళ్ళిపోతారు.

ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరిలో మిత్ర శర్మ కు ఎక్కువ అవకాశం ఉంది.

ఆమె ను గ్లామర్ కోసం నిర్వాహకులు ఉంచాలనుకుంటే అప్పుడు అనిల్ ని బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయి.

అనిల్ కి రెండు సార్లు కెప్టెన్సీ అవకాశం వచ్చినా కూడా అతడు సద్వినియోగం చేసుకోలేక పోయాడు.

తన యొక్క ఆట తీరును మార్చుకుని ఉండ లేక పోవడంతో పాటు ప్రేక్షకుల నుండి సరైన స్పందన దక్కించుకో లేదు.

ఇక మిత్ర శర్మ కంటెంట్ కంటే ఎక్కువగా ఎమోషనల్ పైనే దృష్టి పెడుతుంది.

ఆమె ఎప్పుడు ఏడుస్తూ ఉండడం వల్ల ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది.అందుకే వీరిద్దరికి తక్కువ పడ్డాయి.

మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మరికొన్ని గంటల్లో తేలిపోయే అవకాశం ఉంది.