అనూహ్యంగా పెరిగిన సన్నీ గ్రాఫ్‌.. కెప్టన్సీ పోయినా లాభం దక్కింది

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 5 నాలుగు వారాలు ముగియబోతున్నాయి.ఇప్పటి వరకు ఒక కంటెస్టెంట్‌ పై గట్టి నమ్మకం కాని అభిప్రాయం కాని ఏర్పడలేదు.

గత సీజన్ ల్లో మాత్రం ఒకరు లేదా ఇద్దరిని చూసి ఖచ్చితంగా ఇతడు ట్రోఫీ నెగ్గుతాడేమో అంటూ నమ్మకం కలిగింది.

కాని ఈసారి మాత్రం బిగ్‌ బాస్‌ ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ వల్లనా లేదంటే ఇస్తున్న టాస్క్ ల వల్లనో కాని ఏ ఒక్కరిపై కూడా పూర్తి స్థాయి ఆసక్తి నమ్మకం కలగడం లేదు.

కాని నిన్నటి ఎపిసోడ్‌ లో జరిగిన పరిణామాల కారణంగా అనూహ్యంగా సన్నీ గ్రాఫ్‌ పెరిగింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్‌ బాస్ ను విపరీతంగా ఫాలో అవుతూ విశ్లేషించే వారు చెబుతున్న దాని ప్రకారం కెప్టెన్సీ టాస్క్‌ లో భాగంగా సన్నీ ని ఇంటి సభ్యులు అంతా కూడా కార్నర్ చేయడం జరిగింది.

సన్నీ కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే.కాని ఆయన మరీ అందరితో కత్తి పోట్లు పొడిపించుకునేంత తప్పు మాత్రం చేయలేదు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.

టాస్క్ లో ఎంతో కష్టపడి బరువు తగ్గాడు.తన ది బెస్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు.

అలాంటి సన్నీని అంతా టార్గెట్ చేయడంతో ఆయనకు సానుభూతి వర్కౌట్ అవుతుందని అంటున్నారు.

గతంలో కౌశల్‌ కు సానుభూతి ఇలాగే వచ్చింది. """/"/ అమ్మాయిలు మరియు ఇతరులు అంతా కలిసి కౌశల్‌ ను కార్నర్‌ చేయడం వల్ల అతడికి ప్రేక్షకుల్లో అనూహ్యంగా స్పందన వచ్చి ఏకంగా ట్రోఫీ వరకు వెళ్లాడు.

అందుకే ఈసారి సన్నీ కి ఆ విధంగా దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సన్నీ మరియు ఇతర కుటుంబ సభ్యుల్లో ఇప్పటికే అభిమానులు ఏర్పడ్డారు.కాని ఇప్పుడు సన్నీ గ్రాఫ్‌ పెరిగినట్లుగా సోషల్‌ మీడియాలో కొందరు మాట్లాడుతున్నదాన్ని బట్టి అర్థం అవుతోంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. బంపర్ ఆఫర్ కొట్టేసిన అమర్ దీప్!