బిబి5 లీక్ : ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారు వీళ్లే
TeluguStop.com
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 వారాలు గడిచి పోతున్నాయి.ఇప్పటికే ఈ సీజన్ 50 రోజులు పూర్తి చేసుకుంది.
సీజన్ సగం పూర్తి అయ్యేప్పటికి ఇంటి సభ్యులు ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోయారు.
ఎలిమినేట్ అయిన ఏడుగురు కూడా ప్రేక్షకులకు షాక్ ఇచ్చి వెళ్లారు అనడంలో సందేహం లేదు.
ఒక్కటి రెండు వారాల్లో వారి ప్రవర్తన కారణంగా పెద్ద పనిష్మెంట్ ను తీసుకుంటున్నారు.
అందుకే వారం ఆరంభంలో ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వకుండానే జాగ్రత్తగా ఉండాలి.ఒక వేళ ఎలిమినేషన్ లోకి వెళ్తే మాత్రం సేవ్ అయ్యే వరకు భయం తప్పదు.
ఈవారం కూడా ఎప్పటిలాగే నామినేషన్స్ జరిగాయి.ఇక బిగ్ బాస్ కు సంబంధించిన ప్రతి విషయం కూడా ఈమద్య లీక్ అవుతూనే ఉంది.
తాజాగా నేటి ఎపిసోడ్ లో ఎవరు ఎవరు నామినేట్ అవ్వబోతున్నారు అనే విషయం లీక్ అయ్యింది.
ఆదివారం రోజే ఇంట్లో వారు ఎలిమినేషన్ నామినేషన్ పక్రియలో పాల్గొంటారు.అంటే ఒక రోజు ఆలస్యంగా మనకు చూపిస్తారు.
ఆదివారం జరిగిన విషయాలను కొందరు సోషల్ మీడియా ద్వారా లీక్ అయ్యారు.ఈమద్య లీక్ అవుతున్న విషయాలు అన్ని కూడా నిజం అవుతున్నాయి కనుక ఇవి కూడా నిజం అవ్వొచ్చు అనిపిస్తుంది.
ఇంతకు ఎవరు నామినేట్ అయ్యారు అంటే.లోబో, సిరి, షన్నూ, శ్రీరామ్, రవి మరియు మానస్ లు ఎలిమినేషన్ లో ఉన్నారు.
"""/"/
ఇక ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ కూడా చాలా విభిన్నంగా సాగింది.
ఇద్దరిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఇంటి సభ్యుల నుండి లెటర్స్ వస్తున్నాయి.
ఆ లెటర్ ల కోసం ఇద్దరు కంటెస్టెంట్స్ మద్య చర్చ జరుగుతోంది.లెటర్ చించడంతో పాటు ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడం కూడా జరుగుతుంది.
మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ చాలా రసవత్తరంగా సాగుతోంది అంటూ ప్రోమోలు చూస్తే అర్థం అవుతోంది.
ప్రియాంక కోసం త్యాగం చేసి మానస్ ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యాడు అనేది కూడా సమాచారం.
దేవుడి హుండీలో రూ.20 నోటు వేసి ఏమి కోరుకున్నాడో తెలుస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాలిసిందే