బిగ్‌బాస్ : సోహెల్, మెహబూబ్‌ల జిత్తులమారి గేమ్‌కు అందరు చిత్తు
TeluguStop.com
తెలుగు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.కాయిన్స్ టాస్క్ లో ఎవరి వద్ద ఎక్కువ కాయిన్స్ ఉంటే వారు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ బిగ్ బాస్ ప్రకటించడంతో కాయిన్స్ ను పట్టుకునేందుకు చిన్న పాటి యుద్ధమే చేశారు.
సభ్యులు కొందరు బాబోయ్ మా వల్ల కాదని పక్కకు తప్పుకోగా కొందరు మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేశారు.
ఇక రాత్రి సమయంలో ఒకరి కాయిన్స్ ను మరొకరు దొంగలించడం జరిగింది.ముఖ్యంగా సోహెల్ మరియు మెహబూబు ఇతరుల కాయిన్స్ దొంగలించడంలో చాలా కష్టపడ్డారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందరి వద్ద నుండి లాగడంలో వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించారు.రాత్రి సమయంలో వారు ఒక్క నిమిషం పడుకున్నట్లు కనిపించేలేదు.
సుజాత వద్ద ఉన్న స్పెషల్ స్విచ్ కాయిన్ ను దక్కించుకునేందుకు వారిద్దరూ ప్రయత్నించారు.
కానీ ఆమె దొరకకుండా దాచేయడంతో దొంగలించడం సాధ్యం కాలేదు.మొదట మెహబూబ్ ఆమె కాయిన్స్ ను దొంగలించగా తర్వాత సోహెల్ కూడా కాయిన్స్ ను దొంగలించేందుకు ప్రయత్నించాడు కాని విఫలమయ్యాడు.
అమ్మ వద్ద ఉన్న మొత్తం కాయిన్స్ ను సోహెల్ దొంగలించాడు.దాంతో అతడిపై అమ్మ రాజశేఖర్ కు తీవ్రమైన కోపం వచ్చింది.
ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.మొత్తానికి నేడు కూడా అదే టాస్క్ కంటిన్యూ అవ్వబోతుంది.
నేటితో ఈ గేమ్ పూర్తయి కెప్టెన్ ఎంపిక కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
నేటి వరకు గంగవ్వ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే ఆమె స్థానంలో కొత్తగా ఎవరు కెప్టెన్ గా ఎంపిక అవుతారు అనేది ఆసక్తిగా ఉంది.
చాలా కష్టపడ్డ సోహెల్ లేదా మెహబూబ్ ల్లో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాని సుజాత వద్ద ఉన్న స్విచ్ కాయిన్ ఎలాంటి పని చేస్తుందా అనేది చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్ నుంచి సాయం అందలేదు.. కౌశిక్ తల్లి సంచలన వ్యాఖ్యలు వైరల్!