Keerthy Suresh : కీర్తి సురేష్ పై ఫైరవుతున్న తెలుగు ప్రేక్షకులు.. అసలు విషయం ఏంటంటే?
TeluguStop.com
అప్పుడప్పుడు ప్రేక్షకులు నటీనటులపై ఫైర్ అవుతూ ఉంటారు.నిజానికి ప్రేక్షకులు వారిపై ఫైర్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ.
కానీ వారి గురించి ఏదైనా తెలిస్తే కచ్చితంగా కోప్పడుతూ ఉంటారు.ముఖ్యంగా టాలీవుడ్ లో నటించే నటీనటులకు తెలుగు వాళ్ళు బాగా అభిమానం చూపిస్తూ ఉంటారు.
కానీ ఆ నటీనటులు మాత్రం ఇతర ఇండస్ట్రీ వాళ్ళపై అభిమానం చూపిస్తూ ఉంటారు.
ఇటువంటివి చాలా కామన్ అని చెప్పాలి.కానీ ప్రేక్షకులు మాత్రం అస్సలు జీర్ణించుకోలేక పోతారు.
ఇప్పుడు కీర్తి సురేష్( Keerthy Suresh ) విషయంలో కూడా అదే జరుగుతుంది.
"""/" /
కీర్తి సురేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది కీర్తి సురేష్.
అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా కూడా మార్చుకుంది.ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టుతో బాగా బిజీగా దూసుకెళ్తుంది.
సోషల్ మీడియా( Social Media )లో కూడా యాక్టివ్ గా ఉంటూ తెగ సందడి చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా ఈమెపై తెలుగు ప్రేక్షకులు బాగా ఫైర్ అవుతున్నట్లు తెలిసింది.మరి అది ఏ విషయంలోనే ఇప్పుడు తెలుసుకుందాం.
2000 లో బాలనటిగా మొదటిసారి మలయాళం పైలెట్స్ సినిమా ద్వారా వెండితెర లో అడుగు పెట్టింది కీర్తి సురేష్.
తరువాత తమిళ సినిమాలలో నటించింది.ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమై తెలుగు ప్రేక్షకులను తన తొలి చూపులతోనే ఆకట్టుకుంది.
ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.
ఈ సినిమాతో స్టార్ హోదాకు చేరుకుంది. """/" /
ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.
ఇందులో కొన్ని మంచి సక్సెస్ లు అందుకోగా మరికొన్ని ఫ్లాప్స్ కూడా ఎదుర్కొంది.
ఇక రీసెంట్ గా దసరా సినిమా( Dasara Movie )తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, తన సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.
ఇప్పటివరకు కీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.కానీ గత కొన్ని రోజుల నుండి ఈమె అభిరుచులు మొత్తం మారిపోయాయి.
ఏకంగా అందాలనే బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమెపై ఫైర్ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు.
కారణమేంటంటే.గతంలో తను ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.
ఇష్టమైన హీరో ఎవరు అని అడగటంతో అందరూ ఇష్టమే అని చెప్పుకొచ్చింది. """/" /
అయితే ఏ హీరోతో కలిసి నటించాలని ఉంది అని అడగటంతో అందరి హీరోతో నటించాలని చెప్పను అంటూ.
జయం రవి, కార్తీతో నటించాలని ఉందని.ఇక విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) నటన అంటే కూడా ఇష్టమని.
ఆయనతో కూడా నటించాలని ఉందని తెలిపింది.ఇక దర్శకులలో మణిరత్నం, రాజమౌళి, శంకర్( Shankar ) దర్శకత్వంలో కూడా నటించాలని ఉందని అన్నది.
దీంతో ఈమె మొత్తం కోలీవుడ్ హీరోలపై( Kollywood Heroes ) దృష్టి పెట్టడంతో.
టాలీవుడ్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.నీకు గుర్తింపు రావడానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ.
అటువంటిది ఇక్కడ హీరోలను వదిలి అక్కడి హీరోలపై ఎలా దృష్టి పెడతావు అంటూ ఫైర్ అవుతున్నారు.
యూకేలో గోమాంసం వడ్డనతో ఆ గుంపు విధ్వంసం.. షాకింగ్ వీడియో లీక్..!!