గుడ్ న్యూస్ చెబుతా అంటున్న శ్రీ ముఖి… కొంపదీసి అదేనా…
TeluguStop.com
తెలుగు బుల్లితెరపై బుల్లితెర రాములమ్మ గా గుర్తింపు తెచ్చుకుని తన యాంకరింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న "యాంకర్ శ్రీముఖి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు మొదటగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా నటించిన "జులాయి" చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి సినిమా పరిశ్రమకు నటిగా పరిచయమైంది.
ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో నటిగా ఎవరు గుర్తించలేదు.
దీంతో సినిమా పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు యాంకరింగ్ రంగం వైపు వచ్చింది.ఈ క్రమంలో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ ప్లస్ ఛానెల్ లో ప్రసారమయ్యే "పటాస్ షో" ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు పలు రకాల షోలు, ఈవెంట్లతో బిజీబిజీగా గడుపుతోంది.
అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.
కాగా తాజాగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా యాంకర్ శ్రీముఖి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇంతకీ ట్వీట్ లో ఏముందంటే యాంకర్ శ్రీముఖి ఈ నెల 14వ తారీఖున అనగా ప్రేమికుల రోజున అందరికీ మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని వేచి ఉండాలని చెబుతూ కొంతమేర బోల్డ్ గా ఉన్న ఫోటోలు ట్యాగ్ చేసింది.
దీంతో యాంకర్ శ్రీముఖి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
అంతేగాక కొందరు శ్రీ ముఖి చెప్పేటువంటి ఆ గుడ్ న్యూస్ ఏమిటా.? అంటూ తెగ చర్చించుకుంటున్నారు.
మరికొందరు మాత్రం ప్రేమికుల రోజున అంటే తన ప్రియుడిని పరిచయం చేయబోతోందేమో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కానీ శ్రీముఖి చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏమిటో తెలియాలంటే 14వ తారీకు వరకు ఆగాల్సిందే.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి ఒకపక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తోంది.
అంతేగాక పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ శ్రీముఖి కొంతమేర సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచినట్లూ స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి యాంకర్ "క్రేజీ అంకుల్స్" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
ప్రశాంత్ వర్మ తన కథలను వేరేవాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మంచిదా..?