బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య చేసుకుందంటూ ప్రచారం.. కానీ అసలు నిజం ఏమిటంటే..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు వినియోగం ఎక్కువవడంతో మరియు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశాలు మార్గాలు కూడా ఉండటంతో కొందరు సినీ సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు మరియు అసత్య ప్రచారాలు చేయడంతో సెలబ్రిటీల జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

తాజాగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకున్నటువంటి వితిక శేరు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

కాగా నటి వితిక శేరు 2015వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

దీంతో ప్రస్తుతం వీరిద్దరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.ఇటీవల కాలంలో హీరోయిన్ వితిక శేరు నిద్ర మాత్రలు మ్రింగి ఆత్మహత్యాయత్నం చేసిందని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపించాయి.

దీంతో తాజాగా వితిక శేరు ఓ ప్రముఖ వార్తా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

ఇందులో భాగంగా బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న సమయంలో కొంతమేర నిద్రకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నానని దాంతో అప్పుడప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్ర మాత్రలు ఉపయోగించేదానినని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో ఓసారి కొంచెం ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగడం వల్ల ఎక్కువ సేపు నిద్ర పోయానని దాంతో తన తల్లి కంగారుపడి తనని ఆసుపత్రికి తీసుకెళ్ళిందని దాంతో ఈ విషయం తెలుసుకున్న తన స్నేహితురాలు సోషల్ మీడియాలో తను ఆత్మహత్య చేసుకున్నట్లు షేర్ చేసిందని తెలిపింది.

దాంతో అందరూ కూడా తాను బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అవ్వడం, అలాగే తన భర్త వరుణ్ సందేశ్ తో మనస్పర్ధలు, విభేదాలు రావడంతో ఆత్మహ్యత చేసుకుందంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేశారని ఎమోషనల్ అయ్యింది.

ఈ సంఘటన వల్ల తన వ్యక్తిగత జీవితంలో కొన్ని రోజుల పాటు చాలా సమస్యలు ఎదుర్కొన్నానని ఈ క్రమంలో కొందరు తన బంధువులు కూడా తనతో మాట్లాడటం మానేశారని చెప్పుకొచ్చింది.

ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా తమ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగిందని కాబట్టి ఇక నుంచైనా సినీ సెలబ్రిటీల నుంచి ఏదైనా ఓ వార్తా లేదా మరియు ఇతర విషయాలు షేర్ చేసే విషయంలో కొంచెం ఆలోచించి వార్తలు ప్రచారం చేస్తే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

"""/" / ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే వితికా షేరు తెలుగు యంగ్ హీరో రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.

ఇక వరుణ్ సందేశ్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో ఇందువదన అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 1వ తారీఖున విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న వరుణ్ సందేశ్ ఇందువదన చిత్రంతో హిట్ వరిస్తుందని ఆశిస్తున్నాడు.

మరి ఇందువదన చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

పన్నూన్‌ హత్యకు కుట్ర కేసు : అనుమానితుడు నిఖిల్ గుప్తాని అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్