సానియా మీర్జా కూడా పొట్టి బట్టలు ధరించి టెన్నిస్ ఆడుతుంది.. కానీ మేం వేసుకుంటే… 

తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన  "నగ్నం" అనే చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీ రాపాక అలియాస్ దేవరపల్లి స్వీటీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతో తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తను అందాల ఆరబోతతో ప్రముఖ సినీ దర్శకుల దృష్టిలో పడింది.

 దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలను దక్కించుకుంది.

తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో శ్రీ రాపాక పాల్గొంది.

 ఇందులో భాగంగా తాను "నగ్నం" చిత్రంలో నటించిన సన్నివేశాల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పరుచుకుంది.

తాను ను నగ్న చిత్రంలో అందరూ అనుకున్నట్టుగా బట్టలు లేకుండా నటించలేదని, కాకపోతే దర్శకుడు తన కెమెరా యాంగిల్స్ తో తనని అలా చూపించడం వల్ల అందరూ అలా అనుకున్నారని చెప్పుకొచ్చింది.

అలాగే తానుకూడా సినిమా పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని కాబట్టి తనకు ఎలాంటి బట్టలు వేసుకుంటే సౌకర్యంగా ఉంటుందో తనకు బాగా తెలుసని కూడా చెప్పుకొచ్చింది.

టెన్నిస్ ఆట ఆడేటప్పుడు భారత ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా పొట్టి బట్టలు వేసుకుని ఆట ఆడుతుందని ఈ క్రమంలో ఒక్కోసారి ఆమె లో దోస్తులు కూడా బయటికి కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది.

  కానీ ఆడియన్స్ మాత్రం వాటిని పట్టించుకోకుండా కేవలం ఆమె ఆట మాత్రమే చూస్తారని కానీ సినిమాలలో పొట్టి బట్టలలో కనిపిస్తే ఎందుకు హైలెట్ చేస్తారో తనకు అర్థం కావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాక మనుషులు ధరించినటువంటి బట్టలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయడం సరి కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

"""/"/ అనంతరం తాను తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు, నందమూరి నటసింహం లెజెండ్ బాలకృష్ణ తదితర స్టార్ హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని తెలిపింది.

 ఆతర్వాత సినిమాలపై మనసు మళ్లడంతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న "నగ్నం" చిత్ర ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీ రాపాక తెలుగులో రామ్ గోపాల్ వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది.

వావ్, వాట్ ఏ జీనియస్ జాకెట్.. జపనీయులు మామూలోళ్లు కాదు..