Actress Jayavani: దుస్తులు లేకుండా ఉన్న ఫోటోలు నావి కావన్న ప్రముఖ నటి.. అలాంటి సినిమాలు చేయట్లేదంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి జయవాణి( Actress Jayavani ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈమె పేరు వినగానే ముందుగా మనకు రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలోని ఒరేయ్ సత్తిగా.

బయటికి రారా సచ్చినోడా’ అంటూ చీపురు, చాటలతో రవితేజపై ఆడవాళ్లంతా గొడవకు వెళ్లే సీన్‌ గుర్తుకు వస్తూ ఉంటుంది.

ఈ ఒక్క సీన్ తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది జయవాణి.ఆ తరవాత రాజమౌళి( Rajamouli ) ఆమెకు మంచి అవకాశాలు ఇచ్చారు.

యమదొంగ సినిమాలో యమలోకంలో చిత్రగుప్తుడి మనసు గెలిచిన వనితగా నటించారు.ఇలా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు జయవాణి.

కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది.

అయితే ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలలో అంతగా కనిపించడం లేదు.కాగా ఈమె ఒకప్పుడు గుర్తింపు కోసం కొన్ని వ్యాంప్ క్యారెక్టర్లు చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు తనకు ఆ అవసరం లేదని, కేవలం మంచి పాత్రలు వస్తేనే చేస్తానని అంటోంది.

కాగా మా అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న జయవాణి తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే.

కాగా గత కొద్ది రోజులుగా ఈమె అకౌంట్‌లో అడల్ట్ కంటెంట్ వస్తోంది. """/" / ట్విట్టర్‌లో మహిళలపై అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు( Videos , Photos ) పెట్టే ట్వీట్లను జయవాణి అకౌంట్‌తో రీట్వీట్ చేస్తున్నారు.

ఇదంతా జయవాణి స్వయంగా చేస్తున్నారని అంతా అనుకునే విధంగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

అంతేకాకుండా కామెంట్లు కూడా పెడుతున్నారు.అయితే, ఈరోజు అందరికీ షాక్ ఇస్తూ ఈ ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ట్వీట్ దర్శనమిచ్చింది.

ఈ ట్వీట్‌లో ఒక మహిళ న్యూడ్ ఫొటో వెనుక నుంచి కనిపించేటట్టు ట్వీట్ చేశారు.

ఇది జయవాణి ఫొటో అని ట్వీట్‌లో వివరణ ఇచ్చారు.తాను శూర్పణఖ అనే అడల్ట్ వెబ్‌సిరీస్ చేస్తున్నానని.

నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోందని పేర్కొన్నారు.ఐదు భాషల్లో ఈ సిరీస్ రాబోతోందని త్వరలోనే టీజర్ వస్తుందని తెలిపారు.

ఇదిగో ప్రీ లుక్ అంటూ ఆ న్యూడ్ ఫొటో వదిలారు. """/" / ఈ న్యూడ్ ఫొటోలు పెట్టడంతో ఇది జయవాణి అకౌంటేనా అని అనుమానం వచ్చింది.

వెంటనే ఆ విషయం పై స్పందించిన జయవాణి తనకు అసలు ట్విట్టర్ అకౌంటే లేదని తెలిపింది.

తన పేరు మీద ఎవరో ఈ ఫేక్ అకౌంట్ సృష్టించారని ఆమె ఆరోపించింది.

మీరు శూర్పణఖ ( Surpanakha )అనే వెబ్ సిరీస్ చేస్తున్నారా అని చాలా మంది అడుగుతున్నారని.

నేను లేదని చెబుతున్నానని బహుశా ఈ ట్వీట్లు చూసే వాళ్లు అడుగుతున్నారేమోనని జయవాణి అనుమానం వ్యక్తం చేశారు.

ఆ న్యూడ్ ఫొటోలు తనవి కాదని.ఆ ట్విట్టర్ అకౌంట్ కూడా తనది కాదని.

దయచేసి ఎవ్వరూ ఆ ట్వీట్లను నమ్మొద్దని జయవాణి విజ్ఞప్తి చేసింది.

నా అసలైన బుజ్జి తల్లి శోభితనే….ఆ సమయంలో చాలా ఫీల్ అయ్యింది: నాగ చైతన్య