ఈ యంగ్ హీరోయిన్ అప్పట్లో ఆ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపిందట.... చివరికి...

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏదైనా ఓ వార్త బయటకు పొక్కింది అంటే చాలు నిమిషాల్లో ఇట్టే వైరల్ అయిపోతోంది.

దీంతో కొందరు నిజానిజాలు ఏమాత్రం తెలుసుకోకుండా పనిగట్టుకుని మరీ ప్రచారాలు చేస్తుంటారు అప్పుడప్పుడు.

అయితే తెలుగులో ప్రముఖ హీరో రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ ప్రముఖ నటి ఇసాబెల్ లేటీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది రెండు, మూడు చిత్రాలలోని అయినప్పటికీ తన అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది.

"""/"/ అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అప్పట్లో ఇసాబెల్ లేటీ భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమలో పడిందని, అంతేగాక వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా చెట్టాపట్టాలేసుకుని తిరిగే వాళ్లని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

దీంతో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.కానీ పలు అనివార్య కారణాల వల్ల వీరిద్దరి ప్రేమ పెళ్లికి దారి తీయ లేదట.

దీంతోప్రస్తుతం ఆ క్రికెటర్ మాత్రం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నటువంటి ఓ నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట.

దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటివరకు ఇసాబెల్ లేటీ మాత్రం తన ప్రేమ వ్యవహారంపై వినిపిస్తున్న వార్తల పై స్పందించలేదు.

"""/"/ అయితే ఈ విషయం ఎలా ఉండగా మొదటగా ఇసాబెల్ లేటీ 2012వ సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు రీమా దర్శకత్వం వహించిన తలాష్ చిత్రం ద్వారా నటిగా సినిమా పరిశ్రమకు పరిచయం అయింది.

అయితే ఈ అమ్మడు బ్రెజిల్ దేశానికి చెందిన సిటిజన్ అయినప్పటికీ భారత దేశంలో పలు నటనకు సంబంధించిన కోర్సులు మరియు మోడలింగ్ రంగంలో అవకాశాలు రావడంతో ఇక్కడే సెటిల్ అయింది.

అయితే ఈ అమ్మడు ఆ మధ్య నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

దాంతో ఈ ప్రభావం ఈ సినిమా కెరియర్ పై పడినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?