ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ని టార్గెట్ చేస్తున్న టెలిగ్రామ్… వర్కవుట్ అవుతుందా?
TeluguStop.com
ఈ ప్రపంచం సోషల్ మీడియా( Social Media ) మాయలో పడి కొట్టుకుంటోంది.
ఈ క్రమంలోనే చాలా టెక్ దిగ్గజాలు పోటీ పడి మరి యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూ ఊరిస్తున్నాయి.
అవును, తాజాగా దేశీయ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్( Telegram ) కూడా కొత్తగా ఒక ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
విషయం ఏమిటంటే.ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్నటువంటి స్టోరీస్ ఫీచర్‌ను టెలిగ్రామ్‌లో వినియోగదారులకోసం విడుదల చేయాలని యోచిస్తోంది.
ఈ విషయాన్ని టెలిగ్రామ్ సీఈఓ అయినటువంటి 'పావెల్ దురోవ్( Pavel Durov )' తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.
"""/" /
ఇకపోతే, ఇప్పటివరకు టెలిగ్రామ్ ద్వారా వినియోగదారులు ఇతరులకు మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డ్యాక్యుమెంట్‌లను మాత్రమే షేర్ చేయవచ్చు.
కానీ ఇకనుండి స్టోరీస్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ యూజర్లకు జులై నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా టెలిగ్రామ్ యాప్‌లో స్టోరీస్‌ను ఎవరెవరు చూడాలి? అనే ఆప్షన్‌ను అందిస్తున్నారు.
దీనికోసం సెట్టింగ్‌లో 'ఎవ్రీవన్, సెలెక్టెడ్ కాంటాక్ట్స్, ఓన్లీ కాంటాక్ట్స్' అనే ఆప్షన్లలో యూజర్లు కావాల్సిన వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
"""/" /
ఇక ఈ ఫీచర్ ఛాట్ లిస్ట్ పై భాగంలో మీకు ఇస్తున్నారు.
ఎవరైన కొత్తగా స్టోరీస్‌ను యాడ్ చేసినట్లయితే అవి చాట్ లిస్ట్ పైన కనిపిస్తాయి.
పోస్ట్ చేసిన స్టోరీస్‌లో ఏమైనా మార్పులు ఉంటే అక్కడ టూల్స్ ని వాడుకొని వాటిని మార్చుకొనే వీలుంది.
వాటి సహాయంతో మార్పులు చేసుకోవచ్చు.స్టోరీస్‌లు ఎంతసేపు కనిపించాలనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది.
6, 12, 24, 48 గంటల వరకు టైమ్ సెట్టింగ్‌ను అందించారు.కావాల్సిన టైమ్‌ను సెట్ చేస్తే ఆ సమయం పూర్తయిన తరవాత స్టోరీస్ ఇక కనిపించవు.
దీనిలో పర్మినెంట్ డిస్‌ప్లే ఆప్షన్ కూడా ఇవ్వడం కొసమెరుపు.దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఫొటో, వీడియోలను ప్రొఫైల్‌లో కనిపించేలా పర్మినెంట్‌గా సెట్ చేసుకోవచ్చు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు